దిల్‌ రాజు చేతిలో ముగ్గురు హీరోల జాతకాలు

దిల్‌ రాజు చేతిలో ముగ్గురు హీరోల జాతకాలు

దిల్‌ రాజు హ్యాండు పడితే కానీ లక్కు కలిసి రాదనే ఫీలింగ్‌ తెలుగు చిత్ర పరిశ్రమలో బలపడిపోయింది. అందుకే సొంత బ్యానర్లున్న హీరోలు కూడా అతను పారితోషికం తక్కువ ఇచ్చినా సరే దిల్‌ రాజుతోనే పని చేస్తామని వస్తున్నారు. రామ్‌, నితిన్‌ ఇద్దరూ ఈమధ్య ఎక్కువగా సొంత సినిమాలే చేస్తున్నారు. కానీ వీళ్లిద్దరూ తమ మలి చిత్రాన్ని దిల్‌ రాజు బ్యానర్లోనే చేస్తున్నారు.

దిల్‌ రాజు చేయి పడితే అదృష్టం కలిసి వస్తుందని, అతను కొడుతోన్న వరుస విజయాల్లో తమకీ ఒక హిట్టు పడుతుందని ఆశిస్తున్నారు. నితిన్‌ అయితే లై, ఛల్‌ మోహన్‌ రంగ తర్వాత దిల్‌ రాజుతోనే మళ్లీ తన కెరియర్‌ నిలబడుతుందని నమ్ముతున్నాడు. శ్రీనివాస కళ్యాణం చిత్రంతో తన కష్టాలు తీరిపోతాయని అనుకుంటున్నాడు. రామ్‌కి కూడా 'నేను శైలజ' తర్వాత హిట్టు లేదు.

'హలో గురూ ప్రేమకోసమే'తో తాను కూడా ట్రాక్‌లో పడతానని నమ్ముతున్నాడు. మరో యువ హీరో రాజ్‌ తరుణ్‌కి ఇటీవల ఏదీ కలిసి రావడం లేదు. అతను నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టాయి. మార్కెట్‌ పూర్తిగా పోగొట్టుకున్న రాజ్‌ తరుణ్‌ 'లవర్‌'తో గాడిన పడగలననే ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ముగ్గురు టాలెంటెడ్‌ హీరోల జాతకాలు ఇప్పుడు దిల్‌ రాజు చేతిలో వున్నాయి. వీళ్ళకే కనుక బ్రేక్‌ వస్తే ఇక దిల్‌ రాజు ఎప్పుడంటే అప్పుడు పారితోషికం కూడా అడగకుండా చేసేస్తారనడంలో సందేహం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు