అతడిని దూరంగా పెట్టిన నాగార్జున

అతడిని దూరంగా పెట్టిన నాగార్జున

శివతో నాగార్జునకి అత్యంత సన్నిహితుడిగా మారిన రాంగోపాల్‌వర్మ ముప్పయ్యేళ్ల పాటు అతనికి ఫ్రెండ్‌గానే వున్నాడు. వర్మ కష్టాల్లో వున్నాడని తెలిసే నాగార్జున అతనికి ఆఫీసర్‌ సినిమా ఇచ్చాడు. అయితే ఇష్టానికి సినిమా తీయరాదని, సక్సెస్‌ చేయడానికి ప్రయత్నించాలని, సినిమా ఆడకపోయినా ఫర్వాలేదు కానీ మనిద్దరి పేరు చెడగొట్టేది అవకూడదని నాగార్జున కండిషన్‌ పెట్టాడు.

అయితే ఆఫీసర్‌ సినిమా దక్కించుకున్నా కానీ దానిపై దృష్టి పెట్టకుండా ఎప్పటిలా తన సైడ్‌ వ్యవహారాలని వర్మ కొనసాగించాడు. మీడియా దృష్టిని ఎలా ఆకట్టుకోవాలా అంటూ ప్రతి దాంట్లోను వేలు పెట్టాడు. జిఎస్‌టీ సినిమా తీసి తన ప్రతిష్టని పూర్తిగా పాడు చేసుకున్న రాంగోపాల్‌వర్మ ఆ తర్వాత శ్రీరెడ్డి వెనక వుండి ఆ ఎపిసోడ్‌ని నడిపించి మరింతగా పేరు చెడగొట్టుకున్నాడు. దీంతో అతనిపై ఒక విధమైన అప్రకటిత నిషేధం లాంటిది విధించారు. ఇటు ఇండస్ట్రీలోనే కాకుండా అటు సినీ ప్రేక్షకులు సయితం అతడిని దూరంగా పెట్టారు. ఫలితంగానే ఆఫీసర్‌ చరిత్రలో నిలిచిపోయేంత ఘోరమైన పరాజయం పాలయింది.

ఇండస్ట్రీ మొత్తం వర్మని వ్యతిరేకిస్తున్నా కానీ 'శివ' ఇచ్చాడనే కారణంతో అతడిని దూరంగా పెట్టలేకపోయిన నాగార్జున కూడా ఆఫీసర్‌ తర్వాత వర్మని కలవడం లేదట. ఈ చిత్రం హిట్‌ అయితే అఖిల్‌తో సినిమా ఇస్తానని చెప్పిన నాగార్జున ఇక వర్మ ఊసెత్తే అవకాశమే లేదు. ఎన్ని ఫ్లాపులు వస్తున్నా నాగార్జునతో సినిమా చేసుకునే లైఫ్‌ లైన్‌ అలాగే వుందని ధీమాగా వున్న వర్మ ఇప్పుడు దానిని కూడా వాడేసి వేస్ట్‌ చేసేసాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు