అనసూయ ఫ్యాన్స్ రష్మిని తిట్టారట

అనసూయ ఫ్యాన్స్ రష్మిని తిట్టారట

ఎవరైనా ముందు బుల్లితెరపై పేరు తెచ్చుకుని ఆ తర్వాత వెండి తెరకు వస్తారు. కానీ రష్మి గౌతమ్ మాత్రం దీనికి భిన్నం. ముందు ఆమె సినిమాల్లో నటించింది. అక్కడ పెద్దగా పేరు రాలేదు. ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ఆ తర్వాత ఆమె అనుకోకుండా బుల్లితెర వైపు చూసింది. ‘యువ’ సీరియల్‌తో పేరు సంపాదించింది. ఆపై ‘జబర్దస్త్’ యాంకర్‌గా తిరుగులేని ఫేమ్ తెచ్చుకుంది. అందులో వచ్చిన పేరుతో మళ్లీ సినిమా ఛాన్సులు అందుకుంది.

ఐతే ముందుగా తాను ‘జబర్దస్త్’లోకి వచ్చినపుడు చేదు అనుభవాలు ఎదుర్కొన్నట్లు రష్మి చెప్పింది. అనసూయ స్థానంలో తాను ‘జబర్దస్త్’ యాంకర్‌గా మారడం చాలామందికి నచ్చలేదని.. సోషల్ మీడియాలో అనసూయ ఫ్యాన్స్ తనను సోషల్ మీడియాలో బూతులు తిట్టారని.. ట్రోల్ చేశారని రష్మి చెప్పింది. అప్పుడు కానీ అనసూయకు ఎంత పాపులారిటీ ఉందో తనకు అర్థం కాలేదని ఆమె వెల్లడించింది.

అనసూయకు తనకు మధ్య ప్రొఫెషనల్ పోటీ మాత్రమే ఉంటుందని.. అంతకుమించి అందరూ అనుకుంటున్నట్లు తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని.. ఆమె తనకు చాలా మంచి స్నేహితురాలని రష్మి చెప్పింది. యాంకరింగ్‌లో తమ ఇద్దరిదీ డిఫరెంట్ స్టైల్ అని.. ఎవరి ఐడెంటిటీ కోసం వాళ్లు ట్రై చేస్తుంటామని చెప్పింది. వైజాగ్‌కు చెందిన తాను హైదరాబాద్‌లో ఇంటి భోజనం మిస్సవుతుంటానని.. అలా అనిపించినపుడల్లా అనసూయ ఇంటికే వెళ్లి భోంచేస్తానని రష్మి చెప్పింది. తన పిల్లలు కూడా చాలా క్లోజ్ అని.. వాళ్లతో బాగా ఆడుకుంటానని రష్మి వెల్లడించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English