రజనీ సరసన చందమామ?

రజనీ సరసన చందమామ?

సూపర్ స్టార్ రజనీకాంత్ వయసు 70కి చేరువవుతోంది. ఆయనది అంత అందమైన రూపం కూడా ఏమీ కాదు. చాలా సాధారణంగా కనిపిస్తారాయన. అయినప్పటికీ ఇండియాలో ఏ హీరోయిన్ అయినా రజనీ సరసన నటించే అవకాశం వస్తే ఎగిరి గంతేస్తుంది. ఆయన చరిష్మా.. ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది మరి. రజనీ పక్కన సినిమా చేస్తే వచ్చే గుర్తింపే వేరుగా ఉంటుంది.

అందుకే హీరోయిన్లు రజనీతో సినిమా అవకాశాన్ని వదులుకోరు. ఆయనతో గతంలో చాలామంది స్టార్ హీరోయిన్లు నటించారు. ఇప్పుడు మరో స్టార్ రజనీతో జత కట్టబోతున్నట్లు సమాచారం. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. చందమామ కాజల్. ఈ అందాల భామ రజనీ తర్వాతి సినిమాలో ఓ కథానాయికగా నటించే అవకాశాలున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.

‘పిజ్జా’.. ‘జిగర్ తండ’.. ‘ఇరైవి’.. ‘మెర్క్యురీ’ లాంటి వైవిధ్యమైన సినిమాలతో ఆకట్టుకున్న యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ ఇటీవలే ఓ సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అందులో సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ ఒక కథానాయికగా నటిస్తోంది. ఆమెతో పాటు కాజల్‌ను కూడా నటింపజేయాలని చూస్తున్నాడట కార్తీక్.

ఇటీవలే కాజల్‌కు స్క్రిప్టు, పాత్ర గురించి కూడా వివరించాడట. ఆమె దాదాపు ఓకే అన్నట్లే చెబుతున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన చేయబోతున్నారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి.. బాబీ సింహా లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంతోష్ నారాయణనన్ సంగీతం అందిస్తున్నాడు. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. వచ్చే వేసవికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English