మహేష్‌ సలహాలు, సాయం లేదు... కానీ

మహేష్‌ సలహాలు, సాయం లేదు... కానీ

తన బావమరిది హీరోగా పరిచయమై చాలా కాలమవుతున్నా మహేష్‌ ఎప్పుడూ సుధీర్‌ బాబు కెరియర్‌ పట్ల శ్రద్ధ తీసుకోలేదు. తనకి వచ్చిన అవకాశాలని వాడుకుంటాడని చూస్తూ అడపాదడపా తన సినిమా చూడమని మాట సాయం చేస్తూ మాత్రం వచ్చాడు. ఎలాంటి సినిమాలు చేయాలనే దానిపై సలహాలు కానీ, తన స్నేహితులని అతడితో సినిమా చేయమని చెప్పే సాయం కానీ మహేష్‌ చేయలేదు.

అయితే తనకి ఎలాంటి సినిమాలు సూట్‌ అవుతాయనేది సుధీర్‌ బాబే స్వయంగా తెలుసుకున్నాడు. మొదట్లో నటుడిగా చాలా వీక్‌ అనిపించిన వాడే ఇప్పుడు అన్నిట్లోను మెరుగయ్యాడు. 'సమ్మోహనం' చిత్రంలో చక్కని అభినయంతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ చిత్రం మొదటి రోజు సాయంత్రానికే బాక్సాఫీస్‌ వద్ద పుంజుకుని రెండవ రోజు మంచి వసూళ్లు తెచ్చుకుంటోంది. టాక్‌ బాగుంది కనుక ఖచ్చితంగా సేఫ్‌ సినిమా అయ్యే అవకాశాలున్నాయి.

మొదట్లో ఏ తరహా చిత్రాలు చేయాలనే దానిపై క్లూ కూడా లేని సుధీర్‌ నెమ్మదిగా సినిమాలు చేసుకుంటూ మంచి కథలు మాత్రమే ఎంచుకుంటూ ఇప్పుడు బయ్యర్ల నమ్మకాన్ని కూడా చూరగొంటున్నాడు. పుల్లెల గోపీచంద్‌ బయోపిక్‌ కనుక మెటీరియలైజ్‌ అయితే సుధీర్‌ కెరియర్‌కి మరింత బూస్ట్‌ లభిస్తుంది. ఏదేమైనా కృష్ణ కుటుంబం నుంచి వచ్చి, కుటుంబంలోని ఎవరి సహాయం తీసుకోకుండా స్వశక్తిపై ఎదిగిన సుధీర్‌ని ఎవరైనా అభినందించి తీరాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు