ఆత్మవంచన చేసుకుంటోన్న సూపర్‌స్టార్‌

ఆత్మవంచన చేసుకుంటోన్న సూపర్‌స్టార్‌

ఒక్కోసారి సూపర్‌స్టార్లు అయినా అపజయాలని అంగీకరించలేరని రజనీకాంత్‌ని చూస్తే అర్థమవుతోంది. కాలా చిత్రం ఎంతటి ఘోరమైన ఫ్లాప్‌ అయిందనేది తెలిసిందే. కబాలి చిత్రానికి అయినా కలక్షన్లు వచ్చేసాయి కనుక హిట్‌ అని ఫీలయ్యారని అనుకోవచ్చు. కనీసం కబాలిలో సగం కూడా వసూలు చేయలేకపోయిన కబాలిని పట్టుకుని సక్సెస్‌ అయిందని రజనీకాంత్‌ చిరునవ్వులు చిందిస్తున్నారు.

కబాలి చిత్రాన్ని అభిమానులకి అస్సలు నచ్చని విధంగా తీర్చిదిద్దిన దర్శకుడు పా.రంజిత్‌కి రజనీకాంత్‌ మళ్లీ అవకాశం ఇచ్చినపుడే చాలా మంది ఆశ్చర్యపోయారు. తన నిర్ణయం సరైనదే అని ఈగోతో ఈ చిత్రం హిట్‌ అంటున్నారో, లేక మామ బాధ పడకూడదని అల్లుడు ధనుష్‌ ఆయనకి తప్పుడు సమాచారం అందించాడో కానీ రజనీకాంత్‌ మాత్రం డిజాస్టర్‌ అయిన సినిమాని హిట్‌ అని చెప్పుకుంటూ నవ్వుల పాలవుతున్నారు.

యువ దర్శకులు తనని హ్యాండిల్‌ చేయలేకపోతున్నారని తెలిసినా కానీ రజనీకాంత్‌ మరోసారి కార్తీక్‌ సుబ్బరాజ్‌ అనే దర్శకుడికి అవకాశమిచ్చారు. ఇంతవరకు ప్రయోగాత్మక చిన్న చిత్రాలు తీసిన కార్తీక్‌ తన గత చిత్రం 'మెర్క్యురీ'తో నిరాశపరిచాడు. రజనీకాంత్‌తో అతను ఎలాంటి చిత్రం తీస్తాడనేది ఎవరికీ తెలియకపోయినా ఈ కాంబినేషన్‌ పట్ల కాస్త ఎక్సయిట్‌మెంట్‌ కూడా కలగడం లేదు. తగ్గుతోన్న రజనీ వైభవాన్ని తిరిగి నిలబెట్టే చిత్రమవుతుందని ఆశిస్తోన్న '2.0' ఏమో వాయిదాల మీద వాయిదా పడుతూనే వుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English