నందమూరి హీరోకి కోలుకోలేని దెబ్బ

నందమూరి హీరోకి కోలుకోలేని దెబ్బ

పటాస్‌కి ముందు స్ట్రగుల్‌ అయిన కళ్యాణ్‌రామ్‌కి ఆ అపజయాలని మరిపించే ఘన విజయం పటాస్‌తో దక్కడంతో ట్రాక్‌ ఎక్కేసినట్టే అనుకున్నారు. అయితే ఎలాంటి సినిమాలు చేయాలనే దానిపై క్లారిటీ లేక వరుసగా మూడు ఘోర పరాజయాలని చవిచూసాడు. హ్యాట్రిక్‌ డిజాస్టర్ల తర్వాత 'నా నువ్వే'తో స్టయిల్‌ మార్చి క్లాస్‌ హీరో అనిపించుకోవాలని చూసాడు. అయితే ఈ చిత్రానికి విడుదలకి ముందు నుంచీ సరయిన బజ్‌ రాలేదు.

కళ్యాణ్‌రామ్‌ సినిమాలకి కలిసి వచ్చే మాస్‌ ప్రేక్షకులు కూడా దూరమయ్యే సరికి నా నువ్వే చిత్రం ఘోర పరాజయం దిశగా సాగుతోంది. తొలి రోజు వసూళ్లు అంతంత మాత్రంగా రాగా, రెండవ రోజుకే క్రాష్‌ అయిపోయింది. టాక్‌ అస్సలు బాలేకపోవడంతో ఏ సెంటర్స్‌లో హోల్డ్‌ అవుతుందని ఆశించిన నిర్మాతలకి చుక్కెదురైంది. ఈ పరాజయంతో కళ్యాణ్‌రామ్‌ మార్కెట్‌కి కోలుకోలేని దెబ్బ తగిలింది. నా నువ్వే చిత్రానికే బిజినెస్‌ సరిగా జరగలేదు.

ఇప్పుడీ పరాజయం తర్వాత అతని మలి చిత్రాలకి ఇబ్బందులు తప్పవు. ఏ తరహా చిత్రాలు చేయాలనే దానిపై క్లారిటీ లేక, కథల విషయంలో పొరపాట్లు చేయడం వల్ల మినిమం గ్యారెంటీ హీరో నుంచి మార్కెట్‌ లేని హీరోగా అతను డీమోట్‌ అయ్యాడు. తారక్‌ సాయంతో అయినా కళ్యాణ్‌రామ్‌కి మళ్లీ అతనొక్కడే, పటాస్‌లాంటి చిత్రాలు వస్తాయేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English