ముందు త్రిష తరువాత మహేష్

ముందు త్రిష తరువాత  మహేష్

తెలుగు.. తమిళ ఇండస్ట్రీల్లో దాదాపు పదేళ్లకు పైగా టాప్ హీరోయిన్ గా చెన్నై చిన్నది త్రిష చలామణీ అయింది. అప్పటికి.. ఇప్పటికీ బ్యూటీ ఏ మాత్రం తగ్గకుండా సొగసును జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తోంది. కొత్త హీరోయిన్ల ఎంట్రీతో ఈ మధ్య రేసులో కాస్త వెనుకబడింది. కానీ ఇప్పటికీ త్రిష డెయిరీ బిజీగానే ఉంటోంది.

ఈమధ్య తెలుగులో కాస్త అవకాశాలు తగ్గిన టైంలో త్రిషనేు ఓ సూపర్ ఛాన్స్ వరించింది. సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎల్.నారాయణ ఎన్నో ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. ఈమధ్య కాస్త విరామం ఇచ్చిన ఆయన తిరిగి సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. హీరో మహేష్.. డైరెక్టర్ రాజమౌళిలకు అడ్వాన్సులు కూడా ఇచ్చేశారు. కానీ వీళ్లిద్దరూ ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు. కాబట్టి ఇప్పట్లో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం తక్కువ.  ఈటైంలో కె.ఎల్.నారాయణ హీరోయిన్ త్రిషతో ఓ సినిమా తీయడానికి రెడీ అవుతున్నారు.

శతమానం భవతి డైరెక్టర్ సతీష్ వేగేశ్న రీసెంట్ గా ఓ కథ రెడీ చేశాడు. ఈ కథ హీరోయిన్ త్రిషకు వినిపించాడు. కథ బాగా నచ్చడంతో వెంటనే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో మహేష్ ప్రాజెక్టును పక్కనపెట్టి కె.ఎల్.నారాయణ త్రిషతో సినిమా నిర్మించడానికి రెడీ అయ్యారు. సతీష్ వేగేశ్న ప్రస్తుతం దిల్ రాజు ప్రొడక్షన్ లో నితిన్ హీరోగా శ్రీనివాస కళ్యాణం చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తవగానే త్రిషతో సినిమా స్టార్ట్ చేయనున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు