పండగలా వచ్చాడు.. పూర్తి చేశాడు

పండగలా వచ్చాడు.. పూర్తి చేశాడు

హీరో నారా రోహిత్ కు మంచి నటుడుగా పేరొచ్చింది కానీ కమర్షియల్ హిట్ మాత్రం రావడం లేదు. మూస పాత్రలు చేయకుండా వీలైనంత వరకు కొత్తదనం ఉండే పాత్రల్లోనే నారా రోహిత్ నటిస్తూ వచ్చాడు. కానీ లక్ కలిసిరాక ఇబ్బంది పడుతున్నాడు. కేవలం నటలోనే కాదు.. ప్రొడ్యూసర్లకు అండగా నిలవడంలోనూ నారా రోహిత్ చాలా డిఫరెంట్ అని తాజాగా ప్రూవ్ చేసుకున్నాడు.

నారా రోహిత్ తాజాగా ‘‘పండగలా వచ్చాడు’’ సినిమాలో హీరోగా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయిన స్టేజ్ లో ప్రొడ్యూసర్లు చేతులెత్తేశారు. మిగిలిన కొద్దిపాటి పార్టు పూర్తి చేయలేక సినిమాపై ఆశలు వదిలేసుకున్నారు. దాంతో రోహిత్ స్వయంగా రంగంలోకి దిగాడు. మిగిలిన కాస్త భాగం పూర్తి చేయడానికి అవసరమైన సహాయం అంతా అందించాడు. అతడి హెల్ప్ తో రీసెంట్ గా సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందని తెలిసింది.

‘‘పండగలా వచ్చాడు సినిమా స్క్రిప్ట్.. అందులో తన పాత్ర రోహిత్ కు బాగా నచ్చాయి. ఇప్పుడున్న పరిస్థితిలో ప్రొడ్యూసర్లు మిగిలిన పార్టును ఇప్పట్లో కంప్లీట్ చేసేలా కనిపించలేదు. నిర్మాతల కష్టం చేసుకుని ఆ కష్టమేదో తనే భరించి సినిమా పూర్తయ్యేందుకు సహాయం చేశాడు’’ అంటూ చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English