నేను రౌడీ కాదంటున్న కుర్ర హీరో

నేను రౌడీ కాదంటున్న కుర్ర హీరో

సహజంగా హీరోలకు వరుస ఫెయిల్యూర్స్ వస్తే.. అలర్ట్ అయిపోతారు. భారీ హిట్టు కాకపోయినా.. కనీసం ఖర్చులు రాబట్టగలిగే సినిమా చేయాలనే ఉద్దేశ్యంతో.. సేఫ్ ప్రాజెక్టు అనిపించుకునేందుకు రీమేక్ వైపు దృష్టి సారిస్తారు. చిన్న పెద్దా అనే తేడాలు.. భాషా బేధాలు లేకుండా హీరోలందరికీ ఈ అలవాటు ఉంది.

వరుస పరాజయాలతో హ్యాట్రిక్ కొట్టేసిన రాజ్ తరుణ్.. రీసెంట్ గా రాజుగాడు మూవీతో నిరుత్సాహపడ్డాడు. దీంతో ఇతడు కూడా రీమేక్ పై దృష్టి పెట్టాడనే టాక్ వినిపించింది. తమిళ్ లో నయనతార ప్రధాన పాత్రలో వచ్చిన నానుం రౌడీదాన్ మూవీని తెలుగులో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతుండగా.. ఇందులో ఈ కుర్రాడిని తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. నయన్ రోల్ ను హెబ్బా పటేల్ చేయనుందనే టాక్ కారణంగా.. ఇది వాస్తవమే అని అంతా అనుకున్నారు. రాజ్ తరుణ్-హెబ్బా కాంబినేషన్ లో సినిమాలకు క్రేజ్ ఉండడంతో అందరూ నమ్మేశారు కూడా.

అయితే.. ఈ రీమేక్ పై స్వయంగా క్లారిటీ ఇచ్చేశాడు రాజ్ తరుణ్. 'ఈ వార్తలలో నిజం లేదు. నేను ప్రస్తుతం ఆ రీమేక్ సినిమా చేయట్లేదు. నా తర్వాతి సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. నటీనటులు.. ఇతర టెక్నీషియన్స్ వివరాలు ఇంకా ఫైనల్ కాలేదు' అంటూ చెప్పాడు రాజ్ తరుణ్. అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఈ కుర్రాడు నటించిన లవర్ మూవీ త్వరలో రిలీజ్ కానుండగా.. జూన్ 16న ఫస్ట్ లుక్ ఇవ్వబోతున్నారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు