ఆ సూపర్ స్టార్ ఈసారి ఏం చేస్తాడో

ఆ సూపర్ స్టార్ ఈసారి ఏం చేస్తాడో

రంజాన్ పండగకు సల్మాన్ ఖాన్‌కు ఉన్న అనుబంధం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కొన్నేళ్లుగా ప్రతి రంజాన్‌కూ ఒక సినిమాను రెడీ చేస్తున్నాడు. ఈ పండక్కి వచ్చిన అతడి సినిమాలు ‘భజరంగి భాయిజాన్’.. ‘సుల్తాన్’ భారీ విజయాలందుకున్నాయి. రంజాన్‌కు సల్మాన్ సినిమా వస్తే వసూళ్ల మోత మోగడం ఖాయమన్న నమ్మకం ప్రేక్షకుల్లో బలపడింది. కానీ పోయినేడాది ఈ పండక్కి సల్మాన్ పెద్ద షాక్ తిన్నాడు. గత ఈద్‌కు రిలీజైన అతడి సినిమా ‘ట్యూబ్ లైట్’ తుస్సుమనిపించింది. సల్లూ భాయ్ కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. అయినప్పటికీ ఈద్ సెంటిమెంటును వదులుకోవట్లేదు సల్మాన్. ఈ పండక్కి అతను ‘రేస్-3’తో రెడీ అయ్యాడు. శుక్రవారమే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది.

సైఫ్ అలీ ఖాన్ కథానాయకుడిగా నటించిన ‘రేస్’ అప్పట్లో సెన్సేషనల్ హిట్టయింది. దీని రెండో భాగం అంచనాల్ని అందుకోలేకపోయింది. ఐతే సల్మాన్ రాకతో ‘రేస్-3’కి బాగానే క్రేజ్ వచ్చింది. ఈ చిత్రాన్ని రెమో డిసౌజా రూపొందించాడు. గత నెలలో రిలీజైన ట్రైలర్ చూస్తే మాత్రం చాలా కామెడీగా అనిపించింది జనాలకు. ముందు భాగాల మాదిరి ఇది పకడ్బందీ థ్రిల్లర్‌గా ఉంటుందా అనే విషయంలో సందేహాలు నెలకొన్నాయి. సల్మాన్ అభిమానుల్ని అలరించే మ్యాడ్ మూమెంట్స్ కోసమే ఎక్కువగా ప్రయత్నించినట్లున్నారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. అర్జున్ రాంపాల్.. అనిల్ కపూర్.. ఇలా భారీ తారాగణమే ఉంది ‘రేస్-3’లో. ట్రైలర్ చూస్తే యాక్షన్ ప్యాక్డ్ మూవీ లాగా ఉందీ చిత్రం. విమర్శకులు ఈ చిత్రంపై ఏమన్నా.. ఓపెనింగ్స్ మాత్రం భారీగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. అంతిమంగా ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు