అమెరికా వెళ్లిన హీరోయిన్ల కోసం వేట

అమెరికా వెళ్లిన హీరోయిన్ల కోసం వేట

టాలీవుడ్ కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి. సినిమాల పరంగా తగిలే షాక్స్ ఎప్పుడూ ఉంటాయి. వీటికి తోడు ఈ ఏడాది చాలానే ప్రాబ్లెమ్స్ ఎదురుకాగా.. వీటిలో శ్రీరెడ్డి ఉదంతం ఎక్కువ ప్రభావం చూపింది. క్యాస్టింగ్ కౌచ్ వివాదంతో కొంతకాలం ఉడికిపోయిన టాలీవుడ్.. ఇప్పుడు అమెరికాలో జరిగిన ఓ సెక్స్ స్కాండల్ కారణంగా మళ్లీ హాట్ టాపిక్ అయిపోయింది.

ఓ హీరోయిన్ ను విక్టిమ్ ఏ అంటూ యూఎస్ పోలీసులు విచారణలో భాగంగా వెల్లడించడంతో.. ఇప్పుడు జనాలు అంతా.. అమెరికా వెళ్లొచ్చిన.. తరచుగా వెళుతున్న హీరోయిన్స్ ఎవరా అని ఆరాలు తీయడం మొదలుపెట్టారు. ఆయా భామలు తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో వెకేషన్స్ గురించి పోస్ట్ చేయడం కామన్ అయిపోయింది. మరోవైపు అమెరికాలో ఉన్న పలు తెలుగు.. తమిళ సంఘాలు కూడా హీరోయిన్లను తమ తమ ఈవెంట్లకు పిలిచి.. స్పెషల్ కార్యక్రమాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇలాంటి వాటికి అటెండ్ అయిన సౌత్ హీరోయిన్స్ ఎవరు అని జనాలు ఆరాలు తీయడం మొదలుపెట్టారు. దీంతో అనేక మంది హీరోయిన్స్ పై ఈ సెక్స్ స్కాండల్ మచ్చ పడే పరిస్థితి ఎదురైంది. అయినా అమెరికా వెళ్లినంత మాత్రాన అందుకే అనుకుంటే ఎలా అనేది ఆలోచించాల్సిన విషయం.

అసలు 'విక్టిమ్ ఏ' ఎవరు అయ్యుంటారు అన్న విషయాన్ని తెలుసుకోవడమే జనాల ఆతృత. దానికోసం నెట్టింట్లో వేటాడేస్తున్నారు. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ జరిగినా ఊహాగానాలు అల్లేస్తున్నారు. అయినా అమెరికా పోలీసులు ఇలా విక్టిమ్ ఏ అని పజిల్ గా ఉంచేబదులు.. ఆ నటి ఎవరో తెలియచేస్తే.. కనీసం మిగిలిన వారిపై అయినా మరక పడకుండా ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు