పిక్ టాక్: అప్పుడే అదరగొట్టేస్తోంది

పిక్ టాక్: అప్పుడే అదరగొట్టేస్తోంది

వెండితెరకు వారసులను పరిచయం చేయడం కరణ్ జోహార్ కు కొత్తేమీ కాదు. అందుకే ఈయనను నెపోటిజంకు టార్చ్ బేరర్ అంటూ బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఆరోపణలు చేసింది. అలాగని ఈయనేమీ తన పని చేయడం మానేయడు. అదే స్టైల్ ను కంటిన్యూ చేస్తూనే ఉంటాడు.

ఇప్పుడు స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2 అంటూ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు కరణ్ జోహార్. టైగర్ ష్రాఫ్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో.. ఇద్దరు కొత్త అమ్మాయిలు పరిచయం అవుతున్నారు. తారా సుతారియా.. అనన్య పాండేలను ఈ సినిమాతో ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు కరణ్ జోహార్. చుంకీ పాండే కూతురుగా అనన్య పాండేకు ముందు నుంచే గుర్తింపు ఉంది. దాదాపు ఏడాదిగా ఈ యంగ్ బ్యూటీ సోషల్ మీడియాలో చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఇప్పుడు కూడా ఇదే స్టైల్ ను కంటిన్యూ చేస్తూనే ఉంది. తాజాగా చేసిన ఓ ఫోటో షూట్ ను నెట్ లో పోస్ట్ చేసింది అనన్య. బాలీవుడ్ లో ఇంకా అరంగేట్రానికి ముందే టాప్ ఫోటోగ్రాఫర్లతో ఫోటోషూట్స్ తో అదరగొడుతోంది ఈ యంగ్ బ్యూటీ.

మనీష్ మల్హోత్రా డిజైన్ చేయగా.. అవినాష్ గోవార్కర్ ఫోటోగ్రఫీలో చేసిన ఫోటో షూట్ లో.. ఆఫ్-షోల్డర్ లెహంగా ధరించిన అనన్య పాండే.. ఇట్టే అందరినీ ఆకట్టుకుంటోంది. ఎంట్రీకి ముందే ఇన్నేసి అందాలను ఆరబోస్తున్న అనన్య.. ఇక హీరోయిన్ స్టేటస్ వచ్చాక ఇంకెన్ని చిందులు చూపిస్తుందో!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English