వంద కోట్ల క్లబ్బులో ఆ నలుగురు

వంద కోట్ల క్లబ్బులో ఆ నలుగురు

బాలీవుడ్ కి వంద కోట్ల క్లబ్ కొత్తేమీ కాదు. పైగా టాలీవుడ్ మాదిరిగా అక్కడ షేర్ వసూళ్లను కాకుండా.. నెట్ బాక్సాఫీస్ కౌంట్ లెక్కిస్తారు. దీంతో 100 కోట్ల క్లబ్ లో సినిమా చేరడం కాసింత సులువే అనిపిస్తుంది. కానీ అన్ని రాష్ట్రాల ఆడియన్స్ ను మెప్పించేలా తీయడం మాత్రం క్లిష్టమైన విషయం అని ఒప్పుకోవాలి.

పైగా ఫిమేల్ సెంట్రిక్ గా తీసిన చిత్రాన్ని అందరితోను మెప్పించి.. 100 కోట్ల రేంజ్ కు చేర్చడం కచ్చితంగా పెద్ద విషయమే. శశాంక్ ఘోష్ దర్శకత్వంలో కరీనా కపూర్- సోనమ్ కపూర్- స్వర భాస్కర్- శిఖా తల్సానియా ప్రధాన పాత్రలలో నటించి వేరే ది వెడ్డింగ్ మూవీ ఇప్పుడు 100 కోట్ల వసూళ్లను టచ్ చేసి రికార్డు సృష్టించింది. రిలీజ్ అయిన 13 రోజులకు వీరే ది వెడ్డింగ్ ఈ అద్భుతమైన ఫీట్ సాధించగలిగింది. తొలి వారంలో 54.46 కోట్లను ఇండియాలోనే రాబట్టింది ఈ చిత్రం. ఆ తర్వాత కూడా నిలకడగా వసూళ్లను సాధించిన వీరే ది వెడ్డింగ్ మూవీ.. 13 రోజుల్లో ఇండియా వరకు 75 కోట్లు.. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల కలెక్షన్స్ ను సాధించగలిగింది.

ప్రస్తుతం రంజాన్ మాసం కొనసాగుతుండడం.. సల్మాన్ ఖాన్ మూవీ రేస్3 పండుగ రోజుకు షెడ్యూల్ కావడంతో.. ఈలోగా భారీ వసూళ్లను సాధించే అవకాశం ఈ చిత్రానికి దక్కింది. నలుగురు అమ్మాయిల కథను కాసింత బోల్డ్ గా చూపించిన ఈ కంటెంట్ జనాలను బాగానే మెప్పించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు