రజినీ కంటే కమల్ కి ఏం తక్కువ?

రజినీ కంటే కమల్ కి ఏం తక్కువ?

బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్.. ఇప్పుడు బయోపిక్ లకు కేరాఫ్ అడ్రస్ అయిపోయాడు. రీసెంట్ గా ప్యాడ్ మ్యాన్ అంటూ సినిమా ఇచ్చిన అక్షయ్.. ఇండిపెండెన్స్ డే నాడు తన కొత్త సినిమా 'గోల్డ్' రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. 1948 లండన్ ఒలింపిక్స్ లో కిషన్ లాల్ నేతృత్వంలో ఇండియాకు తొలి ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించిన కథే.. ఈ గోల్డ్ మూవీ.

దేశానికి స్వతంత్రం వచ్చిన మరుసటి ఏడాది జరిగిన ఈ కథను.. స్వతంత్రం వచ్చిన 70 ఏళ్ల సంబరాల సమయంలో ఆగస్ట్ 15న విడుదల చేయడం కచ్చితంగా కరెక్టే. అలాగే.. రెండేళ్లకు పూర్వమే.. షూటింగ్ ఆరంభానికి ముందే ఈ డేట్ ఫిక్స్ చేసుకున్నారు. కానీ.. అక్షయ్ కుమార్ రీసెంట్ మూవీ ప్యాడ్ మ్యాన్ విషయంలో కొంత హంగామా నడిచింది. ఆ సమయంలో రజినీకాంత్ మూవీ 2.ఓ రిలీజ్ ఉంటే మాత్రం.. తాను తన చిత్రాన్ని కచ్చితంగా వాయిదా వేసుకుంటానని ఓపెన్ గానే చెప్పాడు అక్షయ్ కుమార్. ఆ సినిమా విడుదల కాకపోయినా.. రిపబ్లిక్ డేకి రిలీజ్ అనుకున్న డేట్ మిస్ అయింది. 2.ఓ లో అక్షయ్ విలన్ గా నటించిన సంగతి తెలుసు కదా.

ఇప్పుడు రజినీకాంత్ కు సమకాలికుడు.. అంతటి ఇమేజ్ ఉన్న కమల్ హాసన్ తన సినిమా విశ్వరూపం2 ను ఆగస్ట్ 10న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఆ వెంటనే రోజుల వ్యవధిలో అక్షయ్ కుమార్ నుంచి గోల్డ్ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ వచ్చింది. మరి రజినీకాంత్ కోసం తన సినిమా వాయిదా వేసుకునేందుకు సిద్ధమైన అక్షయ్ కుమార్.. కమల్ హాసన్ విషయంలో పోటీ పడేందుకే ఫిక్స్ కావడం ఆశ్చర్యకరమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English