మొత్తానికి డ్యాన్సింగ్ అంకుల్ కలిసేశాడు

మొత్తానికి డ్యాన్సింగ్ అంకుల్ కలిసేశాడు

డ్యాన్సింగ్ అంకుల్ గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. బాలీవుడ్ హీరో గోవిందాకు వీరాభిమాని అయిన సంజీవ్ శ్రీవాస్తవ.. ఫ్యామిలీ ఈవెంట్ లో చేసిన డ్యాన్స్ యూట్యూబ్ లో వైరల్ అవడంతో.. దెబ్బకు సెలబ్రిటీ అయిపోయాడు. సల్మాన్ ఖాన్ దస్ కా దమ్ కార్యక్రమంలో పాల్గొని.. సల్లూ భాయ్ పక్కన కూడా డ్యాన్స్ వేసేశాడు.

ఇప్పుడు తన దేవుడు అయిన గోవిందాని కలిసే అవకాశమే వచ్చింది. మాధురీ దీక్షిత్ జడ్జ్ గా నిర్వహిస్తున్న డ్యాన్సింగ్ కార్యక్రమం డ్యాన్స్ దీవానే లో సంజీవ్ ను భాగం చేశారు. ఈ స్టేజ్ పై అందరితో డ్యాన్స్ చేయడం మాత్రమే కాకుండా.. గోవిందాతో కలిసి స్టెప్పులు వేశాడు సంజీవ్ శ్రీవాస్తవ. ఎన్నో ఏళ్ల నుంచి తను అభిమానిస్తున్న హీరోతో కలిసి స్టేజ్ పంచుకోవడం.. గోవిందాతోనే డ్యాన్స్ చేసే అవకాశం రావడం.. ఆ పక్కనే మాధురి దీక్షిత్ కూడా ఉండడం లాంటి అరుదైన క్షణం మరోసారి రాదు కదా.

గోవిందాను కలిసిన అనుభవాన్ని తనే స్వయంగా చెప్పుకొచ్చాడు సంజీవ్. 'నా జీవితం ధన్యం అయిపోయింది. ఎంత ఆనందం.. ఎంత ఆనందం.. ఇప్పటివరకూ ఇలాంటి ఫీలింగ్ లేదు. ఇలాంటి అరుదైన క్షణాన్ని సాకారం చేసిన నా దేవుడికి కృతజ్ఞతలు' అని చెప్పిన డ్యాన్సింగ్ అంకుల్.. ఏకంగా ఆ దేవుడిలో ఐక్యం అయిపోయిన ఫీలింగ్ కలిగినట్లు చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English