ఎందుకీ గన్నులు? గుళ్ల సౌండింగులూ?

ఎందుకీ గన్నులు? గుళ్ల సౌండింగులూ?

నందమూరి బాలకృష్ణ కొత్త సినిమాకు రంగం రెడీ అయిపోయింది. తనతో జైసింహా మూవీ చేసిన సి.కళ్యాణ్ నిర్మాతగా మరో సినిమా చేస్తున్నారు బాలయ్య. నటసింహం పుట్టిన రోజున ఈ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాగా.. వివి వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.

ఇప్పుడీ సినిమాకు "AK47" అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. టైటిల్ వినగానే పక్కా మాస్ అనే సంగతి అర్ధం అవుతోంది. వినాయక్ అంటేనే మాస్ డైరెక్టర్.. పైగా మాస్ హీరో బాలయ్యతో ఇలాంటి మాస్ టైటిల్ అంటే ఆకట్టుకుంటుందని అంతా ఎక్స్ పెక్ట్ చేస్తాం. కానీ బాలయ్యకు రీసెంట్ టైంలో పక్కా మాస్ అంతగా అచ్చొచ్చిన సందర్భం లేదు. సింహా.. లెజెండ్.. శాతకర్ణి.. చిత్రాలన్నీ వైవిధ్యభరితమైన క్యారెక్టర్ బలంతోనే ఆడాయి కాని.. ఈ మధ్యన పైగా పైసా వసూల్ అంటూ పూరీ జగన్నాథ్ తో తీసిన ఊర మాస్ మూవీ.. అలాగే జైసింహా రిజల్ట్ ఏమయిందో అందరికి తెలిసిన విషయమే.

ఇప్పుడు వివి వినాయక్ తో మరోసారి మాస్ చిత్రం తీసి హిట్టు కొట్టడం సాధ్యమేనా అన్నదే ఆలోచించాల్సిన విషయం. రీసెంట్ గా సాయిధరంతేజ్ కు ఇంటెలిజెంట్ లాంటి డిజాస్టర్ ను వినాయక్ ఇవ్వడంతో.. ఈయనలో ఇప్పటి జనాలను మెప్పించగలిగేంత మాస్ కంటెంట్ ఎంత ఉందో అర్ధం అవుతూనే ఉంది. ఇప్పుడు ఏకే47 అంటూ గన్నులు, గుళ్ల సౌండింగులతో హడావుడి చేస్తే.. ఒక ప్రక్కన పవన్ కళ్యాణ్‌, మహేష్‌, అల్లు అర్జున్ వంటి మాస్ స్టార్లకు కూడా వర్కవుట్ కావట్లేదు. మరి బాలయ్య పరిస్థితేంటి?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English