కొత్త బ్రాండ్ కోసం వెతుకుతోన్న టాలీవుడ్

కొత్త బ్రాండ్ కోసం వెతుకుతోన్న టాలీవుడ్

సినిమా తారలు.. విలాస జీవితం.. ఈ రెండిటికీ చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. తమ డ్రెస్సులు.. మెయింటెనెన్స్.. ఆర్నమెంట్స్.. యాక్సెసరీస్.. ఇలా ప్రతీ ఒక్కటీ ఖరీదైనవిగా.. కొత్త కొత్త బ్రాండ్స్ కావాలని కోరుకుంటూ ఉంటారు. కొంతకాలం క్రితం వరకూ ఓ రేంజ్ సెలబ్రిటీలు మాత్రమే వీటిని భరించగలిగే స్థితి ఉండేది.

కానీ ఇప్పుడు గ్లోబల్ విలేజ్ అయిపోయింది.. కొంతమంది సామాన్య జనాల సంపాదన స్థాయి కూడా బాగానే పెరిగింది. మరోవైపు ప్రతీదాన్ని EMIలో కొనుగోలు చేయడం మన జనాలకు కంపెనీలు బాగానే అలవాటు చేసిపారేశాయి. Superdry, Aeropostle, Abercrombie, GAS, Diesel.. లాంటి కంపెనీల ఉత్పత్తులు లగ్జరీ కేటగిరీలోనే ఉండేవి. కానీ ఇప్పుడివి అందరికీ అందుబాటులోకి వచ్చేయలేదు కానీ.. కొనుగోలు చేసే అవకాశం మాత్రం అందరికీ వచ్చేసింది.  ఇక Range Rover, BMW, Volvo, Benz లాంటి బ్రాండ్స్ ను నెలకు రెండు లక్షలు సంపాదించుకునే IT ఎంప్లాయీ కూడా భరించగలుగుతున్న మాట వాస్తవం. దీంతో సెలబ్రిటీలు ఇప్పుడు కొత్త బ్రాండ్స్ కోసం వెతుక్కుంటున్నారు.

ఇప్పుడు వీరి టార్గెట్ ఏంటంటే.. ఈ తారలు కొనుగోలు చేసే వస్తువులు ఫ్యాషన్ గా.. మోడర్న్ గా ఉండడం మాత్రమే కాదు.. అవి సామాన్యుడికి అందుబాటులో ఉండకూడదట. డిఫరెంట్ గా ఉండడంతో పాటు.. ఇండియాలో అతి తక్కువగా లభించేవి ఏమైనా ఉన్నాయా అని వెతుకుతున్నారట. ఈ మధ్యన ఇలాంటి సెర్చింగ్ టాలీవుడ్ లో బాగా ఎక్కువైందని టాక్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English