కమ్ముల కావాలంటున్న గ్లామర్ భామ

కమ్ముల కావాలంటున్న గ్లామర్ భామ

టాప్ హీరోయిన్ అనే స్టాంప్ కోసం ప్రయత్నించే భామలు ఎవరైనా సరే.. తమకు గ్లామర్ ఇమేజ్ కావాలనే కోరుకుంటారు. టాలీవుడ్ లో అయితే ఈ వెంపర్లాట మరీ ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ గ్లామ్ డాల్ ఇమేజ్ ఉన్న భామలకు ఉన్నంత డిమాండ్.. ఇతర భామలకు కనిపించడం కష్టం. అయితే.. హైద్రాబాదీ భామ అయినా నార్త్ లో పెరిగి.. అక్కడ తన బికినీ గ్లామర్ తో తుప్పు రేగ్గొట్టిన  అదితి రావు హైదరి మాత్రం.. కొత్తగా మాట్లాడుతోంది.

ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన సమ్మోహనం మూవీ ద్వారా తన అదృష్టం పరీక్షించుకుంటోంది అదితి. ఇప్పుడీ మూవీ ప్రమోషన్స్ లో తెగ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్న ఈ భామకు.. తెలుగులో ఏ దర్శకుడి సినిమాలో అవకాశం కోసం ఎదురుచూస్తున్నారనే ప్రశ్న ఎదురైంది. సహజంగా ఇలాంటి క్వశ్చన్ కు రాజమౌళి.. సుకుమార్.. లాంటి పేర్లు వినిపించడం కామన్ అయిపోయింది. కానీ అదితి రావు హైదరి మాత్రం.. తాను శేఖర్ కమ్ముల సినిమాలో నటించేందుకు ఆసక్తిగా ఉన్నానని.. అవకాశం వస్తే మాత్రం అస్సలు వదులుకోనని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

కమ్ముల డైరెక్షన్ లో వచ్చే సినిమాల్లో సహజంగా కథ హీరోయిన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆయా భామలకు కూడా మంచి పేరు వస్తుంది. కాకపోతే గ్లామర్ అనే మాటే వినిపించదు.. అసలు కనిపించదు. అయినా సరే.. కమ్ములతో సినిమా చేయాలని ఉందంటూ ఆశ్చర్యపరిచింది అదితి. ఇక టాలీవుడ్ ప్రస్తుతం స్టార్ హీరోయిన్ల కొరత ఎదుర్కొంటూ ఉండగా.. సమ్మోహనంతో మెప్పిస్తే.. ఓ స్లాట్ కు అదితి రెడీ అయిపోయినట్లే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English