అన్నతో పాటు చెల్లెలికీ హిట్టిస్తాడా?

అన్నతో పాటు చెల్లెలికీ హిట్టిస్తాడా?

మ్యూజిక్ డైరెక్టర్ థమన్.. ఇప్పుడు బాగానే దూసుకుపోతున్నాడు. తొలుత ఇతడిపై రకరకాల కాపీ ఆరోపణలు వచ్చినా.. వాటిని ఖాతరు చేయకుండా కెరీర్ నిర్మించుకున్న ఈ కంపోజర్.. తనదైన స్టైల్ లో సంగీతం ఇవ్వడంలో కూడా ఆరితేరిపోయాడు. టాలీవుడ్ కి టాప్ మ్యూజీషియన్స్ లిస్ట్ లో థమన్ పేరు కూడా తప్పకుండా ఉండాల్సిందే.

రీసెంట్ గా థమన్ సంగీతం అందించిన మూవీ తొలి ప్రేమ. మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ కు ఆ సినిమాతో చక్కటి హిట్ ను అందించాడు. ఈ సినిమా విజయంలో సంగీతం కీలక పాత్ర పోషించింది. అందుకే ఇతడికి మరో కీలకమైన ప్రాజెక్టు అందేలా చూశాడట వరుణ్ తేజ్. ఈ హీరో చెల్లెలు నీహారిక నటిస్తున్న హ్యాపీ వెడ్డింగ్ మూవీకి.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించే బాధ్యతను థమన్ చేతిలో పెట్టారు. ఈ విషయాన్ని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించిదంి.

యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతున్న హ్యాపీ వెడ్డింగ్ మూవీలో సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తుండగా.. శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. అయితే.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఫిక్స్ అయిన వరుణ్ తేజ్.. తనకు తొలిప్రేమ హిట్ ఇచ్చిన మాదిరిగానే.. తన చెల్లికి కూడా హిట్టవ్వమని థమన్ ను సాయం అడిగాడట. మెగా హీరో ఇలా అడగడంతో వెంటనే ఓకే చెప్పేసిన థమన్.. అప్పుడే పనులు కూడా ప్రారంభించేసినట్లు టాక్ వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English