ఆ పాతిక కోట్ల కోసం కమ్ముల వెయిటింగ్

ఆ పాతిక కోట్ల కోసం కమ్ముల వెయిటింగ్

శేఖర్ కమ్ముల తీసిన ఫిదా మూవీ సెన్సేషన్స్ సృష్టించింది. మీడియం బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఏకంగా 50 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టింది. అంతకు ముందు కూడా కమ్ముల సినిమాలు బాగానే ఆడాయ్ కానీ.. ఈ రేంజ్ కు రావడంలో ఉపయోగపడిన అంశం మాత్రం.. మెగా హీరో నటించడమే.

వరుణ్ తేజ్ హీరో కావడంతో కమ్ముల ట్యాలెంట్ కు స్టార్ పవర్ తోడయ్యి.. బాక్సాఫీస్ దగ్గర వండర్స్ చేసేందుకు సాధ్యం అయింది. అంతకు ముందు స్టార్స్ కోసం చూసేవాడు కాదు ఈ దర్శకుడు. కానీ ఒక్కసారి 50 కోట్ల రుచి చూశాక.. ఆ తర్వాత కూడా అంతకు మించిన సినిమా ఆశించడం సహజం. ఇప్పుడు కమ్ముల కూడా అందుకే స్క్రిప్ట్ రైటింగ్ పూర్తయిపోయినా ఇంకా సినిమా అనౌన్స్ చేయలేదు. రానాతో మూవీ రూమర్స్ ను ఖండించేశాడు. ఓ అర్జున్ రెడ్డి.. పెళ్లిచూపులు.. ఇలా వండర్స్ చేసిన సినిమాలు కూడా పాతిక కోట్ల లోపే ఆగిపోయాయి.

కమ్ముల కూడా సొంతగానే 25 వరకూ రాబట్టగలడు. కానీ మరో పాతిక కోట్లు కావాలంటే మాత్రం స్టార్ పవర్ కావాల్సిందే. కమ్ములతో తామే సినిమా నిర్మిస్తామని.. గీతా ఆర్ట్స్ వర్గాలు ఇప్పటికే మాటిచ్చాయట. ఫిదా వెంటనే మళ్లీ వరుణ్ తేజ్ తోనే ఎందుకు అనే ఉద్దేశ్యంతో.. మరో మెగా హీరో డేట్స్ ఇప్పించేందుకు చూస్తున్నారట. సహజంగా ఇలాంటి వెయిటింగులు కమ్ములకు నచ్చవు. కానీ పాతిక కోట్లు అదనంగా కావాలంటే ఆ మాత్రం ఆగక తప్పదు కదా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు