జనాలు తిట్టినా ఇండస్ర్టీ సపోర్ట్ ఆమెకే

జనాలు తిట్టినా ఇండస్ర్టీ సపోర్ట్ ఆమెకే

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి ఎగిరిపోయిన ప్రియాంక చోప్రా.. ఈ మధ్య వివాదంలో చిక్కుకుంది. క్వాంటికో సిరీస్ లో భాగంగా.. రీసెంట్ గా టెలికాస్ట్ అయిన ఓ ఎపిసోడ్ ఆమెను చిక్కుల్లోకి లాగింది. కొందమంది ఇండియన్స్.. న్యూయార్క్ లో కశ్మీర్ అంశంపై జరిగే మీటింగ్ ప్రాంతంలో బాంబులు పేల్చి.. ఆ ఉదంతాన్ని పాకిస్తాన్ మీదకు నెట్టేయాలని ప్రయత్నించారన్నదే.. ఆ ఎపిసోడ్ ప్లాట్.

ఇలా ఇండియాకు వ్యతిరేకంగా ఉన్న ఎపిసోడ్ లో ఎలా నటించిందంటూ పీసీని తిట్టిపోస్తున్నారు జనాలు. తాను ఉద్దేశ్యపూర్వకంగా చేయలేదని.. దేశభక్తి కలిగిన మహిళను అని చెప్పిన ప్రియాంక చోప్రా.. జరిగిన విషయానికి తన క్షమాపణ కూడా చెప్పింది. ఇప్పుడీ టాపిక్ పై బాలీవుడ్ జనాలు రియాక్ట్ అయ్యారు. తాజాగా జరిగిన ఓ కాన్ఫరెన్స్ లో వరుణ్ ధావన్.. బాబీ డియాల్.. కృతి సనోన్.. ఆయుష్మాన్ ఖురానాలతో పాటు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు.. పీసీకి తమ మద్దతు ప్రకటించారు.

ఒక స్క్రిప్ట్ ను డిసైడ్ చేయడం విషయంలో యాక్టర్స్ కు అంత స్వేచ్ఛ ఉండదని చెప్పిన వీరు.. స్క్రిప్ట్ ప్రకారం యాక్ట్ చేయడం మాత్రమే తాము చేయగలుగుతామని.. ఇతరత్రా మార్పులను నిర్ణయించే పరిస్థితి మెజారిటీ సమయాల్లో ఉండదని అన్నారు. అంతే కాదు.. దేశీయ సినిమా పరిశ్రమ ఖ్యాతిని హాలీవుడ్ రేంజ్ కు చేర్చిన ప్రియాంక.. ఇలాంటి ఎపిసోడ్ లో కనిపించడం తప్పేమీ కాదని అభిప్రాయపడ్డారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు