సంజు ఎంత ఇనస్పయిర్ చేస్తాడంటే

సంజు ఎంత ఇనస్పయిర్ చేస్తాడంటే

హీరోగా సంజయ్ దత్ కెరీర్ లో ఎన్ని హిట్లున్నాయో అన్ని విభిన్న కోణాలు అతడి జీవితంలోనూ ఉన్నాయి. సునీల్ దత్ కొడుకయిన జీవితంలో కీలకమైన సమయంలో దారితప్పడంతో ఎన్ని బాధలు పడాలో అన్నీ పడ్డాడు. డ్రగ్స్ కు బానిసయి పతనం అంచుల వరకు వెళ్లిపోయాడు. కానీ వాటిని దాటుకుని వ్యసనాన్ని జయించి తిరిగి స్టార్ డమ్ సంపాదించాడు. అందుకే అతడి జీవితాన్ని ‘సంజు’ పేరుతో తెరకెక్కిస్తున్నారు.

సంజులో రణ్ బీర్ కపూర్ లీడ్ రోల్ చేస్తున్నాడు. ఇందులో డ్రగ్స్ వ్యసనం నుంచి బయటపడటానికి సంజయ్ ఎంత స్ట్రగుల్ అయిందో ఈ సినిమాలో కంటపడి పెట్టించే విధంగా చూపించారు. ఈ టైంలో బ్యాక్ గ్రౌండ్ గా వచ్చే కర్ హర్ మైదాన్ ఫతే పాట చాలా ఇన్ స్పైరింగ్ గా ఉంది. ‘‘నీ యుద్ధం నువ్వే చేయాలి.. నీ ముందున్న శిఖరం నువ్వే అధిరోహించాలి. ఎక్కడా తలవంచకు.. అనుకున్నది సాధించేవరకు’’ అనే అర్ధంతో సాగిన ఈ పాట జీవితంలో కష్ట సమయాన్ని దాటాలని ఆశపడేటప్పడు ఎంత పట్టుదల కావాలో తెలియజెప్పేలా ఉంది. 

కర్ హర్ మైదాన్ ఫతే పాటకు విక్రమ్ మాంట్రోజ్ అందించిన సంగీతం కూడా చాలా ఉత్తేజం కలిగించే విధంగా ఉంది. సుఖ్విందర్ సింగ్ - శ్రేయా ఘోషల్ ల వాయిస్ ఈ పాటకు ప్రాణం పోసింది. ఈపాటలో రణ్ బీర్ ను చూస్తుంటే సంజయ్ దత్ కనిపిస్తాడే తప్ప ఎక్కడా రణ్ బీర్ కనిపించడు. ఓడి గెలవాలంటే.. పతనం నుంచి విజయానికి చేరాలంటే ఎంత శ్రమించాలో.. కుటుంబం ఎంత కష్టాన్ని భరించాలో ఈ పాట చూస్తే చాలు..

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు