నానికి అభిమన్యుడి సపోర్ట్

నానికి అభిమన్యుడి సపోర్ట్

కాస్టింగ్ కౌచ్ పై పోరాటమంటూ వెలుగులోకి వచ్చిన నటి శ్రీరెడ్డి తాజాగా నాచురల్ స్టార్ నానిపై తీవ్రమైన ఆరోపణలే చేసింది. అతడు తనను వాడుకుని వదిలేశాడని... తనకు అవకాశాలు రాకుండా అడ్డం పడుతున్నాడు అంటూ ఆరోపించింది. దీనిపై నాని ఆమెకు లీగల్ నోటీస్ కూడా పంపాడు. తెలుగు పరిశ్రమలో ఎవరూ దీని గురించి ఏమీ మాట్లాడకపోయినా అభిమన్యుడు సినిమాతో తాజాగా హిట్ కొట్టిన కోలీవుడ్ హీరో విశాల్ మాత్రం స్పందించాడు.

‘‘శ్రీరెడ్డి ఇప్పుడు నాని పేరు చెప్పింది. రేపు ఇంకెవరి పేరయినా చెబుతుంది. ఆమె ఇలా పేర్లు చెప్పే బదులు ఆధారాలు ఉంటే బయటపెట్టి మాట్లాడితే బాగుంటుంది. నాకు నాని మంచి ఫ్రెండ్. అందుకుని నేను అతడిని వెనకేసుకుని వస్తున్నానని అనుకోవద్దు. నాని గురించి వ్యక్తిగతంగా తెలిసిన వారెవరైనా అతడు అలాంటి వాడు అంటే నమ్మలేరు. ఆమె పద్ధతి చూస్తే ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ వస్తున్నట్టుగానే ఉంది. నానికి మద్దతుగా మాట్లాడాను కాబట్టి తరవాత ఆమె నోటి వెంట వచ్చే పేరు నాదే కావచ్చు. లేదా ఇంకెవరి పేరయినా చెప్పొచ్చు. ఆధారాలు చూపించకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తామంటే కరెక్టు కాదు కదా’’ అంటూ విశాల్ లాజికల్ గా మాట్లాడాడు.

‘‘ఇవ్వాళ రేపు ఎవ్వరైనా ఓ ఆఫీస్ ఓపెన్ చేసి నేను ప్రొడ్యూసర్ ను.. సినిమా తీస్తున్నాను. హీరోయిన్లను సెలక్ట్ చేస్తున్నామంటూ ఆడిషన్లు చేయొచ్చు. ఇండస్ట్రీలోకి వెలుగులోకి వద్దామని అలాంటి వాళ్లను నమ్ముకుంటే ఒరిగేదేం ఉండదు. అవకాశాల ఎరచూపించి అమ్మాయిలను వాడుకోవడం అన్నది అన్నిచోట్లా ఉంది. అది ఇక్కడా ఉండొచ్చు. అంతమాత్రం చేత పేరున్న వాళ్లను టార్గెట్ చేస్తూ వారిపై బురద జల్లుతామంటే ఎలా సహించాలి’’ అంటూ విశాల్ ప్రశ్నలను సంధించాడు. దీనిపై అటువైపు నుంచి ఎలాంటి కౌంటర్ వస్తుందో చూడాలి మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English