కళ్యాణ్‌ రామ్ కెరియర్లో హాటెస్ట్ పోస్టర్

కళ్యాణ్‌ రామ్ కెరియర్లో హాటెస్ట్ పోస్టర్

నందమూరి కళ్యాణ్ రామ్ ఆచితూచి సినిమాలు చేస్తుంటాడు. గతంతో పోల్చితే ఇప్పుడు స్పీడుగానే సినిమాలు చేస్తున్నాడని చెప్పాలి. ఎమ్మెల్యే విడుదల అయ్యి 3 నెలలు నిండకుండానే.. ఇప్పుడు నా నువ్వే అంటూ మరో మూవీ థియేటర్లలోకి వచ్చేస్తోంది.

యాడ్ ఫిలిం మేకర్ జయేంద్ర దర్శకత్వంలో.. పీసీ శ్రీరాం సినిమాటోగ్రఫీ అందించిన నా నువ్వే మూవీ.. ముందు నుంచి ఆసక్తి కలిగించింది. విజువల్స్ మాత్రమే కాదు.. హీరోయిన్ తమన్నా.. హీరో కళ్యాణ్ రామ్ కూడా తమ కొత్త లుక్స్ తో అలరించారు. ఇప్పుడు రిలీజ్ డేట్ పోస్టర్ ను ఇచ్చారు నా నువ్వే యూనిట్. మిల్కీ బ్యూటీకి మరీ క్లోజ్ గా ఉన్న నందమూరి హీరో.. గెడ్డం కింద ముద్దు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న స్థితిలో కనిపిస్తాడు. ఇప్పటివరకూ కళ్యాణ్ రామ్ ఇలా ఎప్పుడూ కనిపించలేదు.

మాస్ హీరోగా ఇమేజ్ ఉన్న నందమూరి హీరో.. మరీ ఇలా రొమాంటిక్ గా మారిపోవడం ఎప్పుడూ కనిపించలేదు. బహుశా తన కెరీర్ లో హాటెస్ట్ గా కనిపించడం బహుశా కళ్యాణ్ రామ్ కు ఇదే ఫస్ట్ టైం అయినా ఆశ్చర్యం లేదు. ఇక ఇలాంటి వేడిని పంచడంలో మిల్కీ బ్యూటీకి బాగానే ఎక్స్ పీరియెన్స్ ఉంది. ఈ పోస్టర్ మరో ప్రత్యేకత ఏంటంటే.. నా నువ్వే మూవీకి కళ్యాణ్ రామ్ కళ్లజోడు లేకుండా కనిపించడం ఇదే ఫస్ట్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English