2.0.. చివరికి అలా

2.0.. చివరికి అలా

పోయినేడాది దీపావళికి విడుదల కావాల్సిన సినిమా ‘2.0’. కానీ ఇప్పటికీ ఆ చిత్రం విడుదల కాలేదు. ఇదిగో అదిగో అంటూనే వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు. దీపావళి నుంచి రిపబ్లిక్ డేకి.. ఆ తర్వాత ఏప్రిల్‌కు వాయిదా పడి.. అక్కడి నుంచి అతీ గతీ లేకుండా పోయింది. తాజా సమాచారం ప్రకారం.. అసలు ఈ ఏడాది ‘2.0’ విడుదలయ్యే అవకాశాలే లేవంటున్నారు.

విజువల్ ఎఫెక్ట్స్ ఎప్పుడు పూర్తవుతాయో తేలకపోవడంతో కనీసం ఇంకో మూణ్నాలుగు నెలల పాటు ‘2.0’ విడుదలయ్యే అవకాశాలే లేవని తేలిపోయింది. కొంచెం హడావుడి పడితే ఈ ఏడాది చివరి క్వార్టర్లో రిలీజ్ చేసుకునే అవకాశం ఉంది. కానీ అప్పుడు రిలీజ్ వద్దని చిత్ర బృందం ఫిక్సయినట్లు సమాచారం. ఇందుకు వేరే భారీ సినిమాలతో క్లాష్ వస్తుండటమే కారణం.

ఈ ఏడాది దీపావళికి అమీర్ ఖాన్ సినిమా ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ షెడ్యూల్ అయింది. క్రిస్మస్ కానుకగా షారుఖ్ మూవీ ‘జీరో’ విడుదలవుతుంది. అవి చాలా ముందుగానే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాయి. బాలీవుడ్ సినిమాలు ఈ విషయంలో చాలా పక్కాగా ఉంటాయి. ‘2.0’ చిత్రాన్ని దేశవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి వీటికి పోటీగా వెళ్లడానికి అవకాశం లేదు.

అందుకే ఈ ఏడాది రిలీజ్ అనే మాటే పక్కన పెట్టేశారట. వచ్చే ఏడాది రిపబ్లిక్ డే కానుకగా సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారట. అప్పటికి కుదరకపోతే వేసవిని లక్ష్యంగా పెట్టుకుంటారు. కాబట్టి ఈ జనవరి 26 మిస్సయి.. వచ్చే జనవరి 26కు ‘2.0’ వస్తుందన్నమాట. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో శంకర్ కాంప్రమైజ్ కాకపోవడమే సినిమా ఇంత లేటవడానికి కారణమంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English