‘సంజు’లో ఆ సీన్‌పై వివాదం

‘సంజు’లో ఆ సీన్‌పై వివాదం

ఈ ఏడాది బాలీవుడ్లో మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ‘సంజు’ ఒకటి. ‘మున్నాబాయ్ ఎంబీబీఎస్’, ‘మున్నాబాయ్ జిందాబాద్’, ‘3 ఇడియట్స్’, ‘పీకే’ లాంటి అద్భుత చిత్రాలను అందించిన రాజ్ కుమార్ హిరాని.. తన మిత్రుడు సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన చిత్రమిది. దీని టీజర్, ట్రైలర్ సినిమాపై ఎంతో ఆసక్తి రేకెత్తించాయి. ఈ నెల 29న ‘సంజు’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐతే ఈ సినిమాలోని ఒక సన్నివేశం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

సంజు’ ట్రైలర్ చూస్తే అందులో ఒక సీన్లో రణబీర్ జైల్లో ఉండగా.. టాయిలెట్ లీక్ అయి నీళ్లన్నీ జైలు గది అంతా విస్తరించడం చూడొచ్చు. ఈ సీన్ విషయంలో ఇప్పటికే జైళ్ల శాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాజాగా పృథ్వీ అనే ఒక సామాజిక కార్యకర్త ఈ సన్నివేశాన్ని తప్పుబడుతూ సెన్సార్ బోర్డు ఛైర్మన్ ప్రసూన్ జోషికి లేఖ రాశాడు. ఆ లేఖ ప్రతిని చిత్ర దర్శక నిర్మాత రాజ్ కుమార్ హిరానికి కూడా పంపాడు.

భారతీయ జైళ్లలో పరిస్థితులపై తప్పుడు సంకేతాలు ఇచ్చేలా ఈ సన్నివేశం ఉందని పృథ్వీ అన్నాడు. ‘సంజు’ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో విడుదలవుతుందని.. ఈ సీన్ చూసిన వాళ్లు భారతీయ జైళ్లపై తప్పుడు అభిప్రాయం ఏర్పరుచుకుంటారని.. ఇది భారత్ పరువు తీస్తుందని అతనన్నాడు. ఈ సన్నివేశాన్ని తొలగించాల్సిందే అన్నాడు. మరి జైళ్ల శాఖ అధికారుల నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో సెన్సార్ బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English