కృతి ఇన్.. కైరా ఔట్

కృతి  ఇన్.. కైరా ఔట్

బాలీవుడ్ లో సిరీస్ లుగా రూపొందుతున్న సినిమాల జాబితాలో హౌస్ ఫుల్ కూడా ఒకటి. ఇప్పటికే హౌస్ ఫుల్ చిత్రం 3 భాగాలుగా రాగా.. ఇప్పుడు హౌస్ ఫుల్4 కూడా సిద్ధం అవుతోంది. అక్షయ్ కుమార్.. రితేష్ దేశ్ ముఖ్ లతో పాటు బాబీ డియోల్ కూడా హీరోలుగా కనిపించబోతున్నారు.

ఈ మూవీలో ముగ్గురు అందాల భామలు నటించనుండగా.. ఇప్పటికే మహేష్ ఫిలిం 1నేనొక్కడినే బ్యూటీ క్రితి సనోన్.. డీజే భామ పూజా హెగ్డే లను ఖాయం చేసుకున్నారు. ప్రస్తుతం పూజా హెగ్డే కూడా మహేష్ కి హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మూడో హీరోయిన్ పాత్రకు భరత్ అనే నేను మూవీలో మహేష్ కు జోడీగా నటించిన కైరా అద్వానీని ఖాయం చేసుకున్నారనే వార్తలు వచ్చాయి. అయితే.. ఇప్పుడీ పాత్ర నుంచి కైరాను తప్పించి.. కృతి కర్బందాను ఫిక్స్ చేశారట. టాలీవుడ్ బ్రూస్ లీ కి అక్క.. తమిళ బ్రూస్ లీకి లవర్ గా నటించిన కన్నడ బ్యూటీ కృతి కర్బందా.. హౌస్ ఫుల్4లో ఎంట్రీ ఇవ్వడం దాదాపు ఫిక్స్ అయినట్లే అంటున్నారు.

రితేష్ దేశ్ ముఖ్ కు జోడీగా కనిపించే ఈ రోల్ పై చాలానే డిస్కషన్స్ జరగగా.. కొందరు కైరాకు సపోర్ట్ చేశారట. కానీ ఈ రోల్ కు కృతి కర్బందా అయితేనే కరెక్ట్ అని ఎక్కువ మంది భావించడంతో.. ఆమెకే ఈ రోల్ దక్కినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యమ్లా పాగల్ దీవానా కామెడీ సిరీస్ లో నటిస్తున్న కృతి కర్బందా.. మరో కామెడీ సిరీస్ ఫిలింలో కూడా నటించేందుకు సై అనడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English