ప్రభాస్-అనుష్క.. మళ్ళీ స్ర్టాంగ్ రూమర్స్

ప్రభాస్-అనుష్క.. మళ్ళీ స్ర్టాంగ్ రూమర్స్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - టాలీవుడ్ స్వీట్ అనుష్కల మధ్య ప్రేమ వ్యవహారం పీకల్లోతు నడుస్తోందనే మాటలు ఎప్పటి నుంచో వినిపిస్తూనే ఉన్నాయి. బాహుబలి మూవీ తర్వాత ఈ మాటలు బాలీవుడ్ రేంజ్ కు కూడా చేరాయంతే. ప్రభాస్- అనుష్కలు మాత్రం తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అంతే అంటూ పలుమార్లు చెప్పుకొచ్చారు. ఇంతకు మించి ఇంకేదో ఉందని అనేందుకు పలు ఆధారాలను కూడా ప్రస్తావించింది మీడియా.

అయితే.. ఇప్పుడు అనుష్క పెళ్లికి సంబంధించిన పనుల్లో వేగం పుంజుకుంటున్నాయట. ఆమెకు ఈ ఏడాది చివరి నాటికే మ్యారేజ్ చేసేయాలని అనుష్క పేరెంట్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే హిమాలయాలు సహా దేశంలోని ప్రధాన ప్రాంతాలలో పలు పూజా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారని.. పెళ్లి కొడుకు వేటలో ఉన్నారని తెలుస్తోంది. ఇక్కడ ప్రభాస్ పెళ్లి విషయంలో కృష్ణంరాజు ఇచ్చిన స్టేట్ మెంట్ కూడా గుర్తు చేసుకుంటే... ఏదేమైనా సరే 2018 చివరి నాటికి ప్రభాస్ కు పెళ్లి చేసేస్తామని అన్నారు రెబల్ స్టార్. అందుకే ఈ ఏడాది చివరకే ప్రభాస్ అండ్ అనుష్కలు ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అని ప్రెడిక్షన్ చెబుతున్నారు రూమర్ రాయుళ్ళు.

అయితే.. మరి వీరిద్దరే పెళ్లి చేసుకుంటారా.. లేకపోతే ఇద్దరూ వేర్వేరు పెళ్లిళ్లు చేసుకుంటారా అన్నదే ఇప్పుడు అందరికీ ఆసక్తి కలిగిస్తున్న అంశం. ఈ విషయంలో ఏదో ఒక ఫ్యామిలీ నుంచి స్టేట్మెంట్ వస్తే ఈ స్ర్టాంగ్ రూమర్లు ఆగేలా కనిపించట్లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు