8 నిమిషాలు.. 70 కోట్లు.. సాహో లెక్క

8 నిమిషాలు.. 70 కోట్లు.. సాహో లెక్క

ప్రభాస్ లేటెస్ట్ మూవీ సాహో గురించిన ప్రతీ అప్ డేట్ విపరీతమైన ఆసక్తిని కలిగిస్తూనే ఉంది. మొదట తెలుగు సినిమాగా మొదలైన ఈ ప్రాజెక్టు.. ఇప్పుడు నేషనల్ లెవెల్ ఆడియన్స్ ను మురిపించేలా గ్రాండియర్ ను మరింతగా పెంచేస్తున్నారు. బడ్జెట్ విషయంలో నిర్మాతలు ఏ మాత్రం రాజీ పడడం లేదు.

రీసెంట్ గా దుబాయ్ షెడ్యూల్ షూట్ పూర్తి చేసుకుంది సాహో టీం. ఈ ఒక్క షెడ్యూల్ కోసమే 70 కోట్ల మొత్తం ఖర్చు పెట్టారనే టాక్ ముందు నుంచి ఉంది. ఇప్పుడు విషయాన్ని సాహో సినిమాటోగ్రాఫర్ మది కన్ఫాం చేశాడు. సాహో చిత్రంలో అత్యంత కీలకమైన ఈ ఎపిసోడ్.. సినిమాలో 8 నిమిషాల పాటు ఉంటుందట. ఇప్పటివరకూ ఏ ఇండియన్ మూవీలోను యాక్షన్ సీన్ ఇంత హై లెవెల్ లో చూడబోమని చెబుతున్నాడు మది. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్.. ప్రత్యేకమైన శ్రద్ధతో ఈ 8 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ కు అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దాడని చెబుతున్నాడు మది.

కేవలం ప్రీ ప్రొడక్షన్ పనుల కోసమే 100 రోజులకు పైగా సమయం పట్టగా ప్రత్యేకంగా ఖరీదైన కార్లలో ఒకటైన ఈవో ను ఈ యాక్షన్ సీన్ కోసం ఉపయోగించారని సినిమాటోగ్రాఫర్ అంటున్నాడు. వాతావరణ పరిస్థితులు సహకరించకపోయినా.. ఒక్క పూట కూడా బ్రేక్ తీసుకోకుండా.. ఈ 8 నిమిషాల యాక్షన్ సీన్ ను చిత్రీకరించామని.. దర్శకుడు సుజిత్ కు ఉన్న విజన్.. సాహోను మరో స్థాయికి తీసుకెళుతుందని చెబుతున్నాడు ఈ టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్. గతంలో ఈయన తెలుగులో మిర్చి.. శ్రీమంతుడు వంటి సినిమాలకు సినిమాటోగ్రాఫీ అందించిన సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు