ఫైనల్‌గా ఆఫీసర్ ఎంత తెచ్చాడు?

ఫైనల్‌గా ఆఫీసర్ ఎంత తెచ్చాడు?

ఒక పెద్ద హీరో సినిమాకు ఎంత బ్యాడ్ టాక్ వచ్చినప్పటికీ వీకెండ్ వరకు ఓ మోస్తరుగా అయినా వసూళ్లు ఉంటాయి. కానీ థియేటర్ల రెంట్.. ఇతర మెయింటైనెన్స్ ఖర్చులు కూడా రాకపోవడం అన్నది మాత్రం గతంలో ఎన్నడూ జరిగి ఉండదు. అక్కినేని నాగార్జున స్థాయి కథానాయకుడి సినిమాకు ఇలా జరుగుతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఆయన నటించిన ‘ఆఫీసర్’కు ఈ పరాభవమే ఎదురైంది. నాగార్జున కెరీర్లోనే అత్యంత దారుణాతి దారుణమైన ఓపెనింగ్స్ వచ్చాయీ సినిమాకు.

తొలి రోజు కేవలం 55 లక్షల షేర్‌తో పెద్ద షాకే ఇచ్చింది ‘ఆఫీసర్’. రెండో రోజు పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. వసూళ్ల వివరాలు సమప్ చేయడానికి కూడా అవకాశం లేనట్లుగా వచ్చాయి ఫిగర్స్. వీకెండ్ తర్వాత ఎగ్జిబిటర్లే స్వచ్ఛందంగా సినిమాను లేపేసే పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో ‘ఆఫీసర్’ ఫైనల్ కలెక్షన్ల వివరాలు బయటికి రావడానికి సమయం పట్టింది.

ట్రేడ్ వర్గాల తాజా సమాచారం ప్రకారం ‘ఆఫీసర్’ ఫుల్ రన్లో కోటి రూపాయల షేర్ సాధించిందట. తెలంగాణ రాష్ట్రమంతటా కలిపి ఈ చిత్రం ఫుల్ రన్లో కేవలం రూ.11 లక్షల షేర్ రాబట్టడం విస్మయ పరిచే విషయమే. దీంతో పోలిస్తే ఆంధ్రా ప్రాంతంలో పరిస్థితి మెరుగ్గా ఉంది. రాయలసీమలో రూ.17 లక్షలు.. ఉత్తరాంధ్రలో రూ.14 లక్షలు షేర్ వచ్చింది. ఆంధ్రా మొత్తం షేర్ రూ.64 లక్షలు. ఓవర్సీస్ వసూళ్లు రూ.15 లక్షల దాకా ఉన్నాయి. మొత్తం కలిపితే షేర్ రూ.కోటి మార్కును టచ్ చేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English