మహానటి సక్సెస్‌తో దాని రేంజ్‌ పెరిగింది

మహానటి సక్సెస్‌తో దాని రేంజ్‌ పెరిగింది

మహానటి ఘన విజయం సాధించడంతో బయోపిక్స్‌కి డిమాండ్‌ పెరిగింది. జీవిత చరిత్రలని తెలుసుకునే ఉత్సాహం ప్రేక్షకులకి ఎంత వుందనేది తెలిసిన తర్వాత బయోపిక్స్‌ని భారీ స్థాయిలో రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎన్టీఆర్‌ జీవిత కథ ఆధారంగా తీస్తోన్న చిత్రానికి ఒక్కసారిగా స్థాయి పెంచిన సంగతి తెలిసిందే. మొదట తక్కువ బడ్జెట్‌లోనే ప్లాన్‌ చేసిన ఆ చిత్రానికి ఇప్పుడు క్రిష్‌ని తీసుకొచ్చి భారీ బడ్జెట్‌ కేటాయించారు.

పుల్లెల గోపీచంద్‌ జీవిత కథతో కూడా ఒక చిత్రం రూపొందనుంది. సుధీర్‌బాబు ఇందులో కథానాయకుడిగా నటిస్తాడు. ఎప్పుడో ఖరారైన ఈ చిత్రాన్ని ఇంతవరకు మొదలు పెట్టలేదు. ప్రేక్షకులకి ఈ చిత్రం పట్ల వుండే అంచనాలకి తగిన విధంగా బయోపిక్‌ని పకడ్బందీగా తీసేందుకు  కృషి చేస్తున్నారు. ఏదో నటించడానికి నటించడమని కాకుండా స్పోర్ట్స్‌మాన్‌ జీవితం కనుక గోపీచంద్‌ పాత్ర కోసం సుధీర్‌బాబు బ్యాడ్మింటన్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు.

టోర్నమెంట్స్‌ ఆడుతూ ఆట మెరుగుపరచుకుంటున్నాడు. రేపు తెరపై తనని చూస్తే నిజంగా ఆటగాడే కనిపించాలని శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఈ చిత్రం చేసినన్నాళ్లు మరే చిత్రం చేయరాదని కూడా సుధీర్‌ డిసైడ్‌ అయ్యాడు. ఈ చిత్రం సెప్టెంబర్‌కల్లా సెట్స్‌ మీదకి వెళుతుందని చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English