థియేటర్స్‌లో డిజాస్టర్‌.. యూట్యూబ్‌లో బ్లాక్‌బస్టర్‌

థియేటర్స్‌లో డిజాస్టర్‌.. యూట్యూబ్‌లో బ్లాక్‌బస్టర్‌

నితిన్‌ హీరోగా నటించిన లై చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఎంత పెద్ద డిజాస్టర్‌ అనేది తెలిసిందే. నేనే రాజు నేనే మంత్రి, జయ జానకీ నాయక చిత్రాలతో విడుదలైన లై చిత్రాన్ని ప్రేక్షకులు అస్సలు ఆదరించలేదు. నితిన్‌ సినిమాల్లోనే అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచిన లై బాక్సాఫీస్‌ దగ్గర పరాభవాన్ని చవిచూసినా కానీ యూట్యూబ్‌లో మాత్రం సంచలనాలు చేస్తోంది. ఈ చిత్రం హిందీ డబ్బింగ్‌ వెర్షన్‌కి అయిదు కోట్ల ఇరవై రెండు లక్షలకి పైగా వ్యూస్‌ వచ్చాయి.

ఇప్పటికీ వారానికి లక్షల సంఖ్యలో వ్యూస్‌ పెరుగుతున్నాయి. చూసిన వాళ్లలో చాలా మందికి ఈ చిత్రం తెగ నచ్చేసింది కూడా. ఆర్కే దుగ్గల్‌ స్టూడియోస్‌ అనే యూట్యూబ్‌ ఛానల్‌లో అప్‌లోడ్‌ అయిన లై హిందీ వెర్షన్‌కి లక్షా ఎనభై వేలకి పైగా లైక్స్‌ కూడా వచ్చాయి.  తెలుగు నుంచి హిందీలోకి అనువాదమైన చిత్రాలకి యూట్యూబ్‌లో మంచి గిరాకీ వుంది.

సరైనోడు, డిజె లాంటి చిత్రాలు అక్కడ రికార్డులు సృష్టించాయి. లై అనే ఫ్లాప్‌ చిత్రానికి కూడా యూట్యూబ్‌లో వున్న ఆదరణ చూడడం వలనే ఫలితాలతో సంబంధం లేకుండా మన సినిమాల అనువాద హక్కులని భారీ మొత్తాలకి కొనేస్తున్నారు. చిన్నా చితకా హీరోలు నటించిన సినిమాలకి కూడా హిందీ అనువాద హక్కులకి యాభై లక్షల నుంచి కోటి రూపాయలు పలుకుతున్నాయంటే వీటికి డిమాండ్‌ ఎలా వుందనేది స్పష్టమవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English