ఎన్టీఆర్‌ వచ్చినా ఊపు లేదు

ఎన్టీఆర్‌ వచ్చినా ఊపు లేదు

కళ్యాణ్‌రామ్‌ నటించిన 'నా నువ్వే' చిత్రానికి బిజినెస్‌ పరంగా క్రేజ్‌ రాలేదు. మాస్‌ హీరో అయిన కళ్యాణ్‌రామ్‌ క్లాస్‌ లవ్‌స్టోరీ చేయడం, అందులోను అతను నటించిన ఇటీవలి చిత్రాలు ఫెయిలవడంతో దీని పట్ల బిజినెస్‌ వర్గాలు అంతగా ఆసక్తి చూపించలేదు. దీంతో విడుదలకి ముందు ఎన్టీఆర్‌ని పిలిపించి ప్రీ రిలీజ్‌ వేడుక చేసి క్రేజ్‌ పెంచడానికి ప్రయత్నించారు.

ఎన్టీఆర్‌ రావడం వల్ల ఆ ఫంక్షన్‌కి అటెన్షన్‌ దక్కింది. ఎక్కువ మంది దృష్టిలో 'నా నువ్వే' పడింది. అయితే అది ఈ చిత్రం బాక్సాఫీస్‌ని ప్రభావితం చేసే ఛాయలు అయితే కనిపించడం లేదు. ఎల్లుండి రిలీజ్‌ కానున్న ఈ చిత్రానికి బుకింగ్స్‌ చాలా వీక్‌గా వున్నాయి. కళ్యాణ్‌రామ్‌ సినిమాలకి కౌంటర్‌ వసూళ్లు ఎక్కువ వుంటాయి కానీ అతను రెగ్యులర్‌గా చేసే మాస్‌ సినిమా కాదిది.

మల్టీప్లెక్సెస్‌లో, ఏ సెంటర్స్‌లో ఈ చిత్రానికి ఆదరణ బాగుండాలి. విడుదలకి ముందు అయితే ఈ చిత్రం ఆడియన్స్‌ దృష్టిని ఆకర్షించినట్టు లేదు. అసలే సమ్మోహనం అనే మరో క్లాస్‌ సినిమాతో పోటీ పడుతోంది నుక తొలి రోజు మంచి టాక్‌ తెచ్చుకోవడం కంపల్సరీ. మరి ఈ చిత్రానికి ఫస్ట్‌ డే పబ్లిక్‌ రెస్పాన్స్‌ ఎలాగుంటుందనేది తెలియడానికి గురువారం వరకు వేచి చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English