మహేష్‌ 25కి ఇంకా తెగని బేరం

మహేష్‌ 25కి ఇంకా తెగని బేరం

అశ్వనీదత్‌ కష్టాల్లో వున్న టైమ్‌లో ఆయనతో సినిమా చేయడానికి మహేష్‌ డేట్స్‌ ఇచ్చాడు. అయితే దాదాపు ఏడేళ్లు సినిమా నిర్మాణానికి దూరమైన అశ్వనీదత్‌ తిరిగి నిర్మాణం చేపట్టేందుకు జంకుతూ వుండడంతో ఆయనకి రాయల్టీ ఇస్తూ ఆ డేట్స్‌ని దిల్‌ రాజుకి బదిలీ చేస్తానని మహేష్‌ అన్నాడు. పెట్టుబడి పెట్టకుండానే లాభం వస్తుందని అశ్వనీదత్‌ కూడా ఆ డీల్‌కి ఓకే చెప్పారు.

అయితే ఇంతలో మహానటి రిలీజ్‌ అయి అశ్వనీదత్‌ బ్యానర్‌ ఫామ్‌లోకి వచ్చింది. దీంతో ఆయన కుమార్తెలు మహేష్‌ 25వ చిత్రానికి గౌరవ సమర్పకులుగా కాక నిర్మాతలుగానే వ్యవహరిస్తామని, దిల్‌ రాజు భాగస్వామ్యంలో సినిమా నిర్మిస్తామని అంటున్నారట. ఈ చిత్రానికి నిర్మాత హోదాలో ప్రీ ప్రొడక్షన్‌ అంతా చూసుకున్న దిల్‌ రాజు ఈ ఊహించని మలుపుతో షాక్‌ తిన్నాడట.

ఇందులో భాగస్వామ్యం ఇవ్వడానికి దిల్‌ రాజుకి ఇష్టం లేదు కానీ మహేష్‌ దగ్గరకే ఈ తకరారు వెళ్లింది. ఇరువురిలో ఎవరి వైపు మహేష్‌ మొగ్గుతాడనేది తెలీదు. నిర్మాతల మధ్య తలెత్తిన ఈ గొడవ వల్ల షూటింగ్‌కి వెళ్లాల్సిన ఈ చిత్రం కొద్ది రోజులు వాయిదా పడింది. ఇద్దరు నిర్మాతలతోను మహేష్‌కి సత్సంబంధాలు వుండడం వల్ల దీనికి పరిష్కారం కనుక్కోవడం అతనికీ కష్టమైన విషయమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు