నాని, నాగార్జునకి భలే కుదిరింది

నాని, నాగార్జునకి భలే కుదిరింది

ఒక పెద్ద ఫ్లాప్‌ తర్వాత ఏ హీరోకి అయినా తదుపరి చిత్రం కఠినతరం అవుతుంది. ఫ్లాప్‌ తర్వాత వచ్చే సినిమాకి బిజినెస్‌ క్రేజ్‌ రావాలన్నా, ప్రేక్షకులు అంచనాలు పెంచుకోవాలన్నా చాలా కలిసి రావాలి. వరుసగా విజయాలు సాధిస్తూ వెళుతోన్న నానికి 'కృష్ణార్జునయుద్ధం'తో భారీ ఫ్లాప్‌ తగిలింది. తదుపరి చిత్రం సోలోగా వచ్చేదయితే ఖచ్చితంగా నానిపై ఒత్తిడి వుంటుంది. కానీ లక్కీగా అతని మలి చిత్రం మల్టీస్టారర్‌ అయింది.

నాగార్జునతో నాని నటిస్తోన్న చిత్రం పట్ల ట్రేడ్‌లో చాలా క్రేజ్‌ వుంది. ఈ సినిమా లైన్లో వున్నందువల్లేనేమో నాగార్జున 'ఆఫీసర్‌' పరాభవం నుంచి త్వరగా రికవర్‌ అయ్యాడు. ఆఫీసర్‌లాంటి ఫ్లాప్‌ వస్తే ఏ హీరో అయినా కోలుకోవడానికి చాలా టైమ్‌ తీసుకుంటాడు. పరువు పోయేలా ఫ్లాప్‌ అయిన ఆ చిత్రం డిజాస్టర్లకే డిజాస్టర్‌గా నిలిచింది. అయితే వెంటనే నానితో చేస్తోన్న మల్టీస్టారర్‌ వస్తోంది కనుక అభిమానులకి కూడా ఊరటగా వుంది.

ఎప్పట్నుంచో డిస్కషన్స్‌లో వున్న ఈ మల్టీస్టారర్‌ ఈ ఇద్దరు హీరోలకి తగిన టైమ్‌లో సెట్స్‌ మీదకి వెళ్లి ఫ్లాపుల నుంచి ఉపశమనాన్ని ఇచ్చింది. అయితే ఈ చిత్రం ఫెయిలయితే మాత్రం ఇద్దరి తదుపరి చిత్రాలకీ చాలా ఇబ్బంది ఎదురవుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English