మన పరువు తీసినందుకు 70 కోట్లు

మన పరువు తీసినందుకు 70 కోట్లు

గతేడాది వచ్చిన టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ.. కచ్చితంగా మంచి సినిమానే. దేశంలో బహిరంగ మల విసర్జన సమస్యను.. హాస్యభరితంగా తీసిన విధానం.. ఆ సమస్యను చర్చించిన పద్ధతి అందరినీ మెప్పించింది. సినిమా కాసుల వర్షం కురిపించింది. టాయిలెట్ హీరో అంటూ గత శుక్రవారం నాడు ఈ మూవీ చైనాలో రిలీజ్ అయింది.

ఆ దేశంలో కూడా టాయిలెట్స్ సమస్య ఉంది కానీ.. ఆ ప్రాబ్లెం వేరే. పరిశుభ్రత లేకపోవడం.. చాంతాడంత క్యూలు ఉండడం వంటి వాటితో చైనా మహిళలు ఇబ్బంది పడుతున్నారు. చైనాలో కూడా ఎవరూ మూవీగా మలిచేందుకు ధైర్యం చేయని సబ్జెక్టును.. టాయిలెట్ హీరోగా అందించిన విధానానికి.. చైనీస్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. తొలి నాలుగు రోజుల్లో ఈ మూవీ 10.36 మిలియన్ డాలర్లు సాధించింది. మొత్తంగా ఈ సినిమా కలెక్షన్స్ 69.91 కోట్ల మేర ఇప్పటికే వచ్చాయి. ఇంకా వసూళ్లు పుంజుకునే అవకాశం ఉంది.

అయితే.. మన దేశంలో ఉన్న ఓ సీరియస్ సమస్యను కామెడీ చేసి పారేసి.. లాభాలు దండుకున్న నిర్మాతలు.. ఇప్పుడు చైనా నుంచి ఇప్పటికే 70 కోట్లను రాబట్టుకున్నారు. ఓ రకంగా చెప్పాలంటే.. ఇండియా పరువును పట్టుకువెళ్లి చైనాలో పెట్టేసి.. కలెక్షన్స్ రాబట్టుకుంటున్నారు. సమస్య గురించి ఇక్కడ చర్చించడం బాగానే ఉంటుంది కానీ.. భారతీయ మహిళల ఇబ్బందులను ఇంటర్నేషనల్ మార్కెట్ లో తాకట్టు పెట్టేయడం మాత్రం బాధాకరమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English