హీరోయిన్ల నుంచి మేల్ యాక్టర్స్ కు లైంగిక వేధింపులు?

హీరోయిన్ల నుంచి మేల్ యాక్టర్స్ కు లైంగిక వేధింపులు?

మన దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు క్యాస్టింగ్ కౌచ్ అంశం బాగా హాట్ టాపిక్. మీటూ అంటూ హ్యాష్ ట్యాగులు పెట్టి పాత కథలను కూడా బాగానే బయటకు తీస్తున్నారు. దశాబ్దాల క్రితం సాగిన కహానీలు కూడా బాగానే బయటకు వస్తున్నాయి. అయితే.. క్యాస్టింగ్ కౌచ్ అనగానే అవకాశాల కోసం అమ్మాయిలను లైంగికంగా ఉపయోగించుకోవడం.. నటీమణులపై వేధింపులు మాత్రమే గుర్తుకు వస్తుంటాయి.

ఇప్పటివరకూ ఇలాంటి మాటలే వినిపించాయి. గతంలో రణవీర్ సింగ్ తనకు ఓ మేల్ క్యాస్టింగ్ మేనేజర్ నుంచి ఎదురైన సంఘటన చెప్పినా.. అప్పటికి తప్ప అంతగా హైలైట్ కాలేదు. కానీ ఇప్పుడు రేసుగుర్రం విలన్ రవి కిషన్.. సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. కేవలం మహిళలకు మాత్రమే కాదని.. పురుషులు  కూడా ఇలాంటి ప్రాబ్లెమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నాడు. కొందరు హీరోయిన్లు.. ముఖ్యంగా సీనియర్ హీరోయిన్ల నుంచి మేల్ యాక్టర్స్ కు పలుమార్లు లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయని.. ఇండస్ట్రీలో మగవాళ్లకు కూడా కొన్ని మార్లు రక్షణ ఉండడం లేదని అన్నాడు రవి కిషన్.

చెప్పిన మ్యాటర్ బాగానే ఉంది కానీ.. ఇలాంటి విషయాల్లో ఒకటి రెండు పేర్లు అయినా చెబితే.. చెప్పిన మ్యాటర్ లో కాసింత స్ట్రెంగ్త్ తో పాటు.. ఈ టాపిక్ హాట్ గా మారే అవకాశం ఉంటుంది. మరి రేసుగుర్రం విలన్ పేర్లు చెబుతాడో లేదో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు