డిస్ట్రిబ్యూటర్స్ భలే ఎస్కేప్ అయ్యారుగా

డిస్ట్రిబ్యూటర్స్ భలే ఎస్కేప్ అయ్యారుగా

సహజంగా పెద్ద హీరోల సినిమాలు అంటే.. డిస్ట్రిబ్యూటర్లు ఎగబడి పోటీపడి మరీ కోట్లు కుమ్మరించి రైట్స్ కొనుగోలు చేస్తుంటారు. మన దగ్గరే కాదు.. యూఎస్ లో తెలుగు సినిమాలు భారీ వసూళ్లు సాధిస్తుండడంతో అక్కడ కూడా ఇలాగే చేస్తుంటారు. కానీ ఈ మధ్య వారం గ్యాప్ లో వచ్చిన రెండు సినిమాల విషయంలో మాత్రం డిస్ట్రిబ్యూటర్లు భలే ఎస్కేప్ అయ్యారు.

జూన్ 1న నాగార్జున మూవీ ఆఫీసర్ విడుదల కాగా.. 7వ తేదీన రజినీకాంత్ కాలా థియేటర్లలోకి వచ్చింది. ఈ రెండు సినిమాలు కూడా ఫెయిల్ అయ్యాయి. అయితే.. కాలా- ఆఫీసర్ చిత్రాలను ఓవర్సీస్ రైట్స్ ఎవరికీ అమ్మకుండా తామే రిలీజ్ చేసుకున్నారు నిర్మాతలు. అలా చెప్పేకంటే డిస్ట్రిబ్యూటర్స్ ఎవరూ ముందుకు రాకపోవడంతో తామే విడదుల చేసుకోవాల్సిన పరిస్థితి నిర్మాతలకు తలెత్తింది. డిస్ట్రిబ్యూటర్ల అంచనాలే నిజమయ్యాయి.

ఈ రెండిటిలో ఒక్కటి కూడా బాక్సాఫీస్ దగ్గర ఫేర్ చేయలేకపోయింది. 1.65 మి. డాలర్లను వసూలు చేసిన కాలా కొంచెం బెటరే కానీ.. డిస్ట్రిబ్యూటర్ కు అమ్మితే మాత్రం ఇంతకు రెట్టింపు తేవాల్సి వచ్చేది. అప్పుడు కచ్చింతగా సగానికి సగం నష్టం అయ్యేది. ఇక ఆఫీసర్ అయితే ఓవర్సీస్ లో 62వేల డాలర్లను మాత్రమే తెచ్చిపెట్టింది. ఈ రెండు సినిమాలు స్టార్ హీరోస్ చేసినవే అయినా.. ఆడియన్స్ ను ఆకట్టుకోలేదు. ఆ సమయంలో టెంప్ట్ కాకుండా ఉండడం. అనేక మంది డిస్ట్రిబ్యూటర్లను కాపాడింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English