విశాల్ పెళ్లి ఆమెతో లేనట్లే..

విశాల్ పెళ్లి ఆమెతో లేనట్లే..

తెలుగు సినీ పరిశ్రమలో ప్రభాస్ లాగే.. తమిళ ఇండస్ట్రీలో విశాల్ పెళ్లి గురించి ఎప్పట్నుంచో చర్చ నడుస్తోంది. వయసు మీద పడుతున్నా అతను మాత్రం పెళ్లి వైపు అడుగులు వేయట్లేదు. సీనియర్ నటుడు శరత్ కుమార్ తనయురాలైన వరలక్ష్మితో విశాల్‌ ప్రేమాయణం నడుపుతున్నాడని.. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారని ఎప్పట్నుంచో ఊహాగానాలు నడుస్తున్నాయి.

కొన్ని సందర్బాల్లో ఇద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లే కనిపించారు. ఇక పెళ్లే తరువాయి అన్నట్లుగా వ్యవహరించారు. కానీ అధికారికంగా ఏదీ ప్రకటించట్లేదు. సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతున్నా పెళ్లి గురించి ఓపెన్ కావట్లేదు. నడిగర్ సంఘం కోసం నిర్మిస్తున్న భవనం ఎప్పటికి పూర్తవుతుందో.. అదయ్యాకే పెళ్లి అన్న విశాల్ మాట ఎప్పటికి నెరవేరుతుందో అర్థం కావడం లేదు.

ఐతే విశాల్ ఎప్పుడు పెళ్లి చేసుకున్నా వరలక్ష్మినే చేసుకుంటాడని అంతా అనుకుంటుండగా.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో విశాల్ మాటల్ని బట్టి చూస్తే అతడికి అలాంటి ఉద్దేశమేమీ లేదనిపిస్తోంది. తన కొత్త సినిమా ‘అభిమన్యుడు’ సక్సెస్ మీట్ కోసం విశాఖపట్నానికి వచ్చిన విశాల్.. అక్కడి విలేకరులతో మాట్లాడుతూ.. వరలక్ష్మి తనకు స్నేహితురాలే అని.. అంతకుమించి తమ మధ్య ఏమీ లేదని తేల్చేశాడు. చిన్నప్పట్నుంచి వరలక్ష్మి తనకు తెలుసని.. తమ మధ్య ఏ దాపరికాలు ఉండవని.. కానీ తమ మధ్య స్నేహానికి మించి ఏమీ లేదని చెప్పాడు.

విశాల్ ఇంతకుముందు కూడా ఓ సందర్భంలో ఇలాగే మాట్లాడాడు. కానీ ఈసారి అదే విషయాన్ని నొక్కి వక్కాణించాడు. కాబట్టి విశాల్.. నిజంగానే వరలక్ష్మిని పెళ్లి చేసుకోవట్లేదనే అనుకోవాలేమో. మరి విశాల్ ముందు నుంచి వరలక్ష్మికి స్నేహితుడిగానే ఉంటున్నాడా.. లేక ఒక దశలో ప్రేమికుడిగా ఉండి.. మళ్లీ ఇప్పుడు స్నేహితుడి పాత్రకు పరిమితం అవుతున్నాడా అన్నది తెలియదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు