శ్రీదేవి పెద్ద మిస్టేక్‌ చేసిందా?

శ్రీదేవి పెద్ద మిస్టేక్‌ చేసిందా?

శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి కపూర్‌ పట్ల వున్న క్రేజ్‌ ఏ రేంజ్‌లో వుందో తెలిసిందే. ఆమె కెమెరా ముందు ఎలా కనిపిస్తుందా అని ఆత్రుతగా ఎదురు చూసారు. అచ్చం శ్రీదేవిలానే వుంటుందంటూ మీడియా తెగ ఊదరగొట్టింది. అయితే ఆమె తొలి చిత్రం 'ధడక్‌' ట్రెయిలర్‌లో మాత్రం జాన్వీ తేలిపోయింది. అందంలో, అభినయంలో శ్రీదేవికి ఏమాత్రం సరితూగదని కామెంట్లు ఎదుర్కొంటోంది. ముక్కు కరక్షన్‌ కోసం సర్జరీ చేయించుకున్న జాన్వీకి ఇప్పటికీ ముక్కు తీరు బాలేదు.

అసలే పర్‌ఫార్మెన్స్‌ ప్రధాన డీ గ్లామరైజ్డ్‌ క్యారెక్టర్‌ చేసిందేమో తన బలహీనతలు కవర్‌ చేసుకునే వీలు చిక్కలేదు. బయట ఎప్పుడూ గ్లామర్‌ డ్రస్సుల్లో అందాలు ప్రదర్శిస్తూ హైలైట్‌ అయ్యే జాన్వీకి మొదటి సినిమాలో అలా గ్లామర్‌గా కనిపించే ఛాన్స్‌ దొరకలేదు. తను ఇంతకాలం జనాలకి పరిచయమైన దానికి పూర్తి భిన్నమైన గెటప్‌లో ఆమె కనిపించడంతో ఇంతకాలం ఆహా, ఓహో అన్నవాళ్లు కూడా పెదవి విరిచేస్తున్నారు.

జాన్వీని గ్లామర్‌ క్యారెక్టర్‌తో పరిచయం చేయకుండా ఇలాంటి పాత్రని ఎంచుకోవడం ద్వారా శ్రీదేవి మిస్టేక్‌ చేసిందా? ఈ ట్రెయిలర్‌కి వస్తోన్న స్పందనని బట్టి మాత్రం జాన్వీ ఫస్ట్‌ లుక్‌లో ఇంప్రెస్‌ చేయలేకపోయిందని స్పష్టమవుతోంది. మీడియాలో పెయిడ్‌ ఆర్టికల్స్‌ ఎలా వచ్చినా కానీ కామన్‌ పీపుల్‌ మాత్రం జాన్వీ కేవలం వారసత్వంతోనే అవకాశం దక్కించుకుంది తప్ప అందం, టాలెంట్‌తో కాదని నిక్కచ్చిగా చెప్పేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English