పవన్‌-త్రివిక్రమ్‌లా అల్లు అర్జున్‌-అతను!

పవన్‌-త్రివిక్రమ్‌లా అల్లు అర్జున్‌-అతను!

దర్శకుడు, కథానాయకుడు మధ్య స్నేహ బంధాలు ఏర్పడడం తరచుగా జరిగేదే. ఇటీవలి కాలంలో హీరో-డైరెక్టర్‌ జోడీలో బాగా క్లోజ్‌ ఫ్రెండ్స్‌ అయింది త్రివిక్రమ్‌-పవన్‌ కళ్యాణే. వీరి స్నేహం ఎంత బలమైందనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కొంతకాలం త్రివిక్రమ్‌ మాటని పవన్‌ మీరనే లేదని కూడా చెప్పుకున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్‌కి కూడా అలాంటి ఒక డైరెక్టర్‌ ఫ్రెండ్‌ దొరికాడట.

అతను మరెవరో కాదు... అల్లుతో డీజే తీసిన హరీష్‌ శంకర్‌. త్రివిక్రమ్‌లానే మంచి మాటకారి అయిన హరీష్‌ ఇప్పుడు బన్నీకి థిక్కెస్ట్‌ ఫ్రెండ్‌ అట. బన్నీకి ఖాళీ వున్నపుడల్లా హరీష్‌ని పిలిపించి పిచ్చాపాటీ మాట్లాడుతున్నాడట. మొదట్లో అల్లు అర్జున్‌ని 'సర్‌.. సర్‌' అని పిలిచిన హరీష్‌ ఇప్పుడతనితో ఏకవచనంలోకి వచ్చేసాడు. మహానటి చిత్ర బృందాన్ని అల్లు అర్జున్‌, అరవింద్‌ కలిసి సన్మానించడానికి కూడా హరీష్‌ సలహానే కారణమట.

అంతే కాకుండా పవన్‌కళ్యాణ్‌తో, అతని అభిమానులతో వైరం పెట్టుకున్న అల్లు అర్జున్‌ మళ్లీ ఇప్పుడు వారికి సన్నిహితం కావడానికి, పవన్‌ గురించి పాజిటివ్‌గా కామెంట్స్‌ చేయడానికి కూడా హరీష్‌ ప్రభావం వుందని వినిపిస్తోంది. వీరిద్దరూ కలిసి మరో చిత్రం చేయాలనే ఆలోచన ప్రస్తుతానికి చేయడం లేదు కానీ రోజు రోజుకీ క్లోజ్‌ ఫ్రెండ్స్‌ అయిపోతున్నారనేది మాత్రం టాలీవుడ్‌ టాక్‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు