శ్రీరెడ్డి తగ్గట్లే... నాని గురించి పచ్చిగా!

శ్రీరెడ్డి తగ్గట్లే... నాని గురించి పచ్చిగా!

శేఖర్‌ కమ్ముల గురించి అవాకులు చవాకులు పేలిన శ్రీరెడ్డి అతను ఎదురు తిరగగానే తోక ముడిచేసింది. లీగల్‌ యాక్షన్‌ తీసుకుంటానని అతను అనగానే వెంటనే అసలు 'నిన్ను అననే లేదు' అంటూ ప్లేటు తిప్పేసింది. నానిపై కొంతకాలంగా ఆరోపణలు చేస్తోన్న శ్రీరెడ్డికి అతడినుంచి లీగల్‌ నోటీసులు వెళ్లాయి. దీంతో మరోసారి పలాయనవాదం వినిపిస్తుందని భావించారు.

కానీ చిత్రంగా నాని యాక్షన్‌ తీసుకున్నా కానీ అతడికి ఎదురెళ్లి 'లీగల్‌గా ప్రొసీడ్‌ అవడానికి రెడీ' అంటోంది. అంతే కాకుండా తనతో శృంగారం చేసాడంటూ, అతనికి ఇష్టమైన భంగిమ ఫలానా అంటూ ఆమె తీవ్రమైన వ్యాఖ్యలతో సంచలనం చేస్తోంది. ఇక దీని గురించి మాట్లాడనని నాని చెప్పేయడంతో శ్రీరెడ్డి తనదైన శైలిలో ఎదురుదాడి మొదలు పెట్టింది. బిగ్‌బాస్‌ సీజన్‌ 2లో తనకి అవకాశం రాకుండా చేసాడని నానిపై ఆరోపణలతో ఆమె మీడియాకెక్కింది. అతనే పట్టుబట్టి తన అవకాశాన్ని చెడగొట్టాడని ఆమె ఆరోపిస్తోంది. ఇంతకాలం సైలెంట్‌గా వున్న నాని గట్టిగానే బదులిచ్చాడు కానీ శ్రీరెడ్డి అస్సలు వెనక్కి తగ్గడం లేదు.

పవన్‌ ఉదంతం తర్వాత ఆమెకి ఛానల్స్‌లో టైమ్‌ ఇవ్వడం లేదు గానీ ప్రస్తుతం నాని మీద ఆరోపణలతో మరోసారి వార్తల్లోకి ఎక్కగలిగింది. ఒకవైపు బిగ్‌బాస్‌ షో హోస్ట్‌గా నాని వార్తల్లో నానుతోన్న టైమ్‌లో శ్రీరెడ్డి అతడిని డైరెక్ట్‌గా టార్గెట్‌ చేయడంతో సోషల్‌ మీడియాలో ఇదే హాట్‌ టాపిక్‌ అయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English