మహేష్‌ దగ్గర ప్రస్తుతానికి నో ఎంట్రీ

మహేష్‌ దగ్గర ప్రస్తుతానికి నో ఎంట్రీ

మహేష్‌ కోసం కథ రెడీ చేసుకున్న దర్శకులెవరైనా సరే కనీసం అతని అపాయింట్‌మెంట్‌ తీసుకోవాలన్నా కూడా ఒక రెండేళ్లు వేచి చూడక తప్పదు. వంశీ పైడిపల్లి చిత్రం మొదలు పెట్టిన మహేష్‌ దీని తర్వాత సుకుమార్‌తో చేయాలని ఫిక్స్‌ అయిపోయాడు. త్రివిక్రమ్‌, రాజమౌళి ప్రాజెక్టులు లైన్లో వున్నాయి కానీ అవి ఎప్పుడు మొదలయ్యేదీ ఇంకా క్లారిటీ లేదు. మరోవైపు బోయపాటి శ్రీనుతో ఒక మాస్‌ సినిమా చేసే ఆలోచన మహేష్‌ చాలా కాలంగా చేస్తున్నాడు. అగ్రిమెంట్‌ అయిపోయిన వారికే మహేష్‌ ఇప్పుడు దొరకడం లేదు.

ఇక అసలు అతడిని కలవని వారికి అవకాశాలెలా వస్తాయి? దిల్‌ రాజు ద్వారా, మంజుల ద్వారా మహేష్‌ని కలవడం కోసం పలువురు దర్శకులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఏ కథలు విననని, రెండేళ్ల తర్వాతే వింటా కనుక ఆ దర్శకులని వేరే హీరోలతో సినిమాలు చేసుకోమని చెప్పేస్తున్నాడట. మహేష్‌కి కథ చెప్పాలంటే ఎవరైనా వయా నమ్రత వెళ్లాల్సిందే. ప్రస్తుతానికి రెండు సినిమాలు ఓకే చేసి పెట్టిన మహేష్‌ రెండిటి కోసం రెండేళ్లు కేటాయించేసాడు. అందుకే ప్రస్తుతానికి మహేష్‌ గేటు ముందు నో ఎంట్రీ బోర్డు తగిలించేసారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు