ఆ దర్శకుడి భవితవ్యం తేలిపోనుంది

ఆ దర్శకుడి భవితవ్యం తేలిపోనుంది

రెండేళ్ల కిందట సంక్రాంతికి వచ్చిన అక్కినేని నాగార్జున సినిమా ‘సోగ్గాడే చిన్నినాయనా’ అంచనాల్ని మించిపోయి భారీ విజయం సాధించింది. రూ.50 కోట్లకు పైగా షేర్ సాధించి నాగ్ కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. కొత్త దర్శకుడైన కళ్యాణ్ కృష్ణ కురసాల ఈ చిత్రాన్ని రూపొందించాడు. అతడి పనితనం నచ్చి సొంత బేనర్లో ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా కూడా తీశాడు నాగ్. అది కూడా సూపర్ హిట్టయింది. అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్లోనే కళ్యాణ్ తన మూడో సినిమా కూడా చేయాల్సింది. అదే.. ‘సోగ్గాడే చిన్నినాయనా’ ప్రీక్వెల్ బంగార్రాజు. గత ఏడాదే పట్టాలెక్కాల్సిన ఈ చిత్రానికి నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

దీంతో మాస్ రాజా రవితేజతో ‘నేల టిక్కెట్టు’ తీశాడు కళ్యాణ్. ఈ సినిమా ఫలితమేంటో తెలిసిందే.ఈ సినిమా విడుదలకు ముందు ‘బంగార్రాజు’ గురించి మాట్లాడుతూ.. ఆగస్టులో షూటింగ్ మొదలవుతుందని.. అంతకంటే ముందు నాగార్జునకు స్క్రిప్టు వినిపించి గ్రీన్ సిగ్నల్ గెచ్చుకుంటానని అన్నాడు కళ్యాణ్. ఐతే ‘నేల టిక్కెట్టు’ రిజల్ట్ తర్వాత నాగ్ ఎలా స్పందిస్తాడో అర్థం కావడం లేదు. కళ్యాణ్ మాత్రం నిరాశ చెందకుండా కొన్ని రోజులుగా ‘బంగార్రాజు’ స్క్రిప్టుకు తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నాడు. ఒకట్రెండు రోజుల్లోనే నాగార్జునకు స్క్రిప్టు వినిపించబోతున్నాడట కళ్యాణ్. మరి నాగ్ స్పందన ఎలా ఉంటుంది.. కళ్యాణ్ ఆశిస్తున్నట్లు సినిమా పట్టాలెక్కుతుందా లేదా అన్నది కొన్ని రోజుల్లోనే తేలిపోనుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English