బిగ్ బాస్-2లో ఆయన చాలా స్పెషల్

బిగ్ బాస్-2లో ఆయన చాలా స్పెషల్

మొత్తానికి ‘బిగ్ బాస్’ రెండో సీజన్ మొదలైపోయింది. ఈసారి షోలో పాల్గొనే పార్టిసిపెంట్లెవరన్న దానిపై సస్పెన్స్ వీడిపోయింది. ఆదివారం రాత్రి తొలి ఎపిసోడ్లో హౌస్‌లోకి ఎవరెవరు ఎంటరవుతున్నారో వెల్లడైపోయింది. ముందు రోజు ప్రచారంలో ఉన్న పేర్లే ఖరారయ్యాయి. ఐతే ఈ లిస్టు ఏమంత ఎగ్జైట్మెంట్ ఇచ్చేలా లేదని.. ఈ పార్టిసిపెంట్లు ఏమాత్రం షోను రక్తి కట్టిస్తారో అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి.

ముగ్గురు కొత్తవాళ్లకు తోడు.. ఐదారుగురు పెద్దగా ఫేమ్ లేని వాళ్లే ఉండటం ఒకింత నిరాశ కలిగిస్తోంది. ఐతే తేజస్వి మదివాడ.. గీతా మాధురి.. శ్యామల.. సామ్రాట్.. తనీష్ లాంటి వాళ్లు షోను హోల్డ్ చేస్తారని భావిస్తున్నారు. వీళ్లందరూ కాక హౌస్‌లోకి ఓ విలక్షణమైన వ్యక్తి ఎంటరయ్యారు. ఒక వర్గం ప్రేక్షకుల్లో ఆయన పట్ల విపరీతమైన ఆసక్తి ఉంది. ఆయన మరెవరో కాదు.. బాబు గోగినేని.

హేతువాద సంఘం ప్రతినిధిగా.. సోషల్ యాక్టివిస్టుగా బాబు గోగినేనికి మంచి పేరే ఉంది. టీవీ చర్చల్లో స్వామీజీలు.. జ్యోతిష్యులు.. నకిలీ డాక్టర్ల గాలి తీస్తూ బాబు గోగినేని ఎన్నోసార్లు హీరో అయ్యాడు. లెక్కకు మిక్కిలి డిగ్రీలు చేసి.. డాక్టరేట్ కూడా తీసుకుని.. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో తిరిగి.. అపారమైన పరిజ్ఞానం సంపాదించాడాయన. ఆయన మాటలు చూస్తేనే మేధావి అన్న సంగతి అర్థమవుతుంది. ఇలాంటి వ్యక్తి ‘బిగ్ బాస్’కు రావడం ఆశ్చర్యం కలిగించేదే. గత ఏడాది షోలో పాల్గొన్న కత్తి మహేష్‌తో ఆయన్ని పోలుస్తున్నారు. బాబుకు కత్తి మిత్రుడు కూడా.

విషయ పరిజ్ఞానంలో.. వాదనల్లో కత్తిని మించిన వాడు బాబు. ఈయనకు సొసైటీలో చాలా పేరుంది. గౌరవ మర్యాదలూ ఉన్నాయి. ఐతే కత్తి లాగా ఉద్దేశపూర్వకంగా కాంట్రవర్శీల్లో జోక్యం చేసుకునే రకం కాదు బాబు. మరి ఈయన ‘బిగ్ బాస్’ హౌస్‌లో ఎలా ఉంటారు.. సహచరులతో ఎలా వ్యవహరిస్తారు.. జనాల దృష్టిని ఆకర్షించి ఎన్నాళ్ల పాటు హౌస్‌లో కొనసాగుతారు అన్నది ఆసక్తికరం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు