మొన్న చిరు ఫ్లాట్.. నిన్న మహేష్ ఫిదా

మొన్న చిరు ఫ్లాట్.. నిన్న మహేష్ ఫిదా

హరీష్ శంకర్ స్టేజ్ ఎక్కితే మెరుపులే మెరుపులు. అతడి వాక్ ప్రవాహం మామూలుగా ఉండదు. శనివారం అతను ‘తేజ్ ఐ లవ్యూ’ ఆడియో వేడుకలో మెగాస్టార్ చిరంజీవి మెస్మరైజ్ అయిపోయేలా ఆయన గురించి గొప్పగా మాట్లాడాడు హరీష్.

ఇక ఆదివారం రాత్రి అతడి మాటలకు మహేష్ బాబు ఫిదా అయిపోయాడు. మహేష్ ప్రత్యేకతేంటో తనదైన శైలిలో చెప్పాడు హరీష్ ఈ వేడుకలో. మహేష్ బాబు డైరెక్టర్ల ఆలోచనల్ని అర్థం చేసుకుని.. వాళ్ల బాడీ లాంగ్వేజ్.. టైమింగ్ లోకి వెళ్లిపోయి నటించే విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుందని హరీష్ చెప్పాడు.

ఇందుకు ఉదాహరణలు చెబుతూ.. ‘పోకిరి’.. ‘బిజినెస్ మేన్’ సినిమాల్లో పూరి జగన్నాథ్ యాటిట్యూడ్ మొత్తం మహేష్ బాబు పాత్రల్లో చూడొచ్చన్నాడు. ఇక ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో శ్రీకాంత్ అడ్డాల వ్యక్తిత్వం.. యాస మహేష్ పాత్రలో కనిపిస్తుందన్నాడు. ఇక ‘దూకుడు’ సినిమాలో శ్రీను వైట్ల కామెడీ టైమింగ్ ను మహేష్ చూపించాడని.. ‘శ్రీమంతుడు’.. ‘భరత్ అనే నేను’ చిత్రాల్లో కొరటాల శివ మార్కు సటిల్ యాక్టింగ్ తో మెప్పించాడని. . ఇలా ఏ దర్శకుడితో పని చేస్తే ఆ దర్శకుడి అంతరంగాన్ని అందిపుచ్చుకుని నటించడం మహేష్ ప్రత్యేకత అని హరీష్ చెప్పాడు.

దీనికి చక్కటి పోలిక కూడా చెప్పాడు హరీష్. మహేష్ పాదరసం లాంటి వాడని.. ఏ వస్తువులోకి పోస్తే దానిలా పాదరసం మారిపోయినట్లు.. పని చేసే దర్శకులకు తగ్గట్లుగా మహేష్ మౌల్డ్ అవుతాడని.. ‘దూకుడు’ టైటిల్ సాంగ్ లో లిరిక్ రైటర్ విశ్వ ‘పాదరస ఒరవడి నరనరమే’ అనే మాటలు రాశాడని హరీష్ చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు