3డిలో చూపించేంత ఆ సినిమాలో ఏముంది?

3డిలో చూపించేంత ఆ సినిమాలో ఏముంది?

జురాసిక్ పార్క్ సినిమాను 3డిలో చూడటమంటే ఒక కొత్త కిక్ ఉంటుంది. ఎందుకంటే అందులో ఉండే రాక్షసబల్లులు ఎలియాస్ డైనోసార్లు.. నిజంగానే మన కళ్ళ ముందు నుండి పరిగెడుతున్నాయా లేదంటే మనవైపుకే పరిగెత్తుకొస్తున్నాయా అనే ఫీలింగ్ ఉంటుంది. అలాగే స్పైడర్ మ్యాన్.. ఎవెంజర్స్.. వండర్ ఉమెన్ వంటి సినిమాలను 3డిలో చూస్తే.. ఒళ్ళు గగుర్పొడిచే విన్యాసాలను.. విజువల్ ఎఫెక్ట్స్ ను మనం అత్యంత దగ్గరగా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. కాని పసలని పులిహోర సినిమాలను స్టీరియోస్కోపిక్ ఎఫెక్టులో చూపిస్తామంటే ఎలా? సరిగ్గా మనోళ్లు అదే పని చేస్తుంటారు.

ఇదే 3డిలో రూపొందిన 'ఓం 3డి' వంటి సినిమాలను చూస్తే మాత్రం.. అసలు ఈ సినిమాకు స్టీరియోస్కోపిక్ ఎఫెక్ట్ అవసరమేంటి గురూ అనిపిస్తుంది. కథా కథనం అన్నీ కూడా కమర్షియల్ మసాలా చందాన ఉన్నా కూడా.. తెరపై కనిపంచే విజువల్స్ అబ్బురపరిచే రీతిలో ఉంటేనే 3డి వలన ఉపయోగం ఉంటుంది. అవన్నీ పట్టించుకోకుండా ఏదో ఆడియన్స్ ను ఆకట్టుకోవాలని తరహాలో.. మన ఓం 3డి తరహాలో ఇప్పుడు సల్మాన్‌ ఖాన్ కూడా 'రేస్ 3' సినిమాతో వస్తున్నాడు. కేవలం అబు దాబి నగరంలో తీసిన కార్ చేజ్ కోసమైన ఈ సినిమాను 3డిలో చూడాలంటూ తెగ ప్రమోట్ చేస్తున్నాడు.

ఓ నాలుగు ట్విస్టులు.. ఇద్దరు గాళ్‌ ఫ్రెండులు.. ఒక మోసం.. అన్న తరహాలో సాగే రేస్ సినిమాను నిజంగా 3డిలో చూడాల్సినంత సీన్ అయితే లేదు. కాని జనాలను ఆకట్టుకోవాలి కాబట్టి.. ఈ రకంగా ఏదో రచ్చ చేస్తున్నారు. అదేదో ఆ ఫోకస్ అంతా స్టోరీ అండ్ స్టంట్స్ మీద పెట్టొచ్చుగా భాయ్??

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు