అమీర్ ట్వీటుకు కూడా అంత సీన్లేదు

అమీర్ ట్వీటుకు కూడా అంత సీన్లేదు

సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు ఆరాటంగా ఎదురుచూసిన కాలా మూవీ థియేటర్లలోకి వచ్చింది. రజనీ ఫాలోయింగ్ కు... ఇమేజ్ కు భిన్నంగా ఈ సినిమాపై మొదటి నుంచి బజ్ తక్కువే కనిపించింది. దీనికి ముందు కబాలీ లాంటి ఫ్లాప్ మూవీ తీసిన డైరెక్టర్ పా.రంజిత్  కాలా సినిమాకు డైరెక్టర్ గా చేశాడు.  కబాలీలాగే మళ్లీ మాఫియా బ్యాక్ గ్రౌండ్ తోనే సినిమా రావడం.. రజనీ లుక్ కూడా దాదాపుగా అలాగే ఉండటంతో కాలా సినిమాపై అభిమానులు పెద్దగా అంచనాలు పెట్టుకోలేదు.

బాలీవుడ్ స్టార్ హీరో.. మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ గా పేరు తెచ్చుకున్న అమీర్ ఖాన్ కాలా సినిమాను ప్రమోట్ చేస్తూ మాట్లాడాడు. బేసిక్ గా ఇతరుల సినిమాల గురించి చాలా తక్కువగా మాట్లాడే అమీర్ ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో స్వయంగా ట్వీట్ పెట్టాడు. ‘‘ఎప్పుడూ రజనీకి పెద్ద ఫ్యాన్ ను. కాలా చూడటానికి ఇంక వెయిట్ చేయడం నా వల్ల కాదు’’ అంటూ అమీర్ ఖాన్ ట్వీట్ చేశాడు. అమీర్ లాంటి నటుడి నుంచి ఇలాంటి కామెంట్ రావడమంటే గ్యారంటీగా అది సినిమాకు పెద్ద ప్లస్ పాయింటే అవుతుంది. సినిమాపై ప్రేక్షకుల్లో బజ్ పెంచుతుంది.

కానీ కాలా విషయంలో ఇదంతా బోల్తా కొట్టింది. ఈ సినిమాకు కలెక్షన్లు మొదటి నుంచి డల్ గానే ఉన్నాయి. అమీర్ ట్వీట్ తరవాత కూడా అందులో పెద్దగా మార్పేమీ లేదు. సినిమా బాగానే ఉందని అంటున్నా థియేటర్లలో పెద్దగా  జనాలు ఉండటం లేదు. ఈ విషయంలో అమీర్ ట్వీట్ కు అంత సీన్ లేదని బాలీవుడ్ జనాలు తేల్చిచెప్పేస్తున్నారు. రజనీకాంత్ అల్లుడు ధనుష్ ప్రొడ్యూస్ చేసిన కాలా చిత్రంలో ఈశ్వరీరావు.. హ్యూమా ఖురీషీ హీరోయిన్లుగా నటించారు.   

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English