స్టార్ హీరోయిన్ ను కాపాడేందుకు ఛానల్ ప్రయత్నం

స్టార్ హీరోయిన్ ను కాపాడేందుకు ఛానల్ ప్రయత్నం

బాలీవుడ్ హీరోయిన్ మాజీ మిస్ వరల్డ్ ప్రియాంక చోప్రా బేవాచ్ సినిమాతో హాలీవుడ్ లో అడుగుపెట్టింది. రాక్ గా బాగా ఫేమస్ అయిన డ్వేన్ జాన్సన్ ఇందులో హీరోగా నటించాడు. ప్రియాంక హాలీవుడ్ లో పాపులర్ అవడానికి కారణం క్వాంటికో టీవీ సిరీస్. ఈ అమెరికన్ టీవీ మొదటి సిరీస్ లో రెచ్చిపోయి మరీ సెక్స్ సీన్లలో నటించిన ప్రియాంక తరవాత యాక్షన్ పార్టుల్లోనే ఎక్కువగా కనిపించింది. తాజాగా వచ్చిన మూడో సిరీస్ లో భారత్ ను కించపరిచేలా తీయడంతో ప్రియాంక పేరు వివాదాల్లో చిక్కుకుంది.

క్వాంటికో-3లో ప్రియాకం చోపా అలెక్స్ పారిష్ అనే యువతి పాత్రలో నటించింది. ఈ సిరీస్ లోని తాాజా ఎపిసోడ్ లో భారత జాతీయులు అమెరికాలోని మన్ హటన్ లో న్యూక్లియర్ అటాక్స్ కు ప్లాన్ చేస్తారు. అమెరికాలో విధ్వంసం సృష్టించి అందులో పాకిస్థాన్ ను ఇరికించాలన్నది వారి ప్లాన్. ఇలా సిరీస్ మొత్తం ఇండియాకు వ్యతిరేకంగా ఉంటుంది. దీనిపై ఇండియన్స్ భగ్గుమంటున్నారు. భారత దేశంలో పుట్టి పెరిగి స్టార్ స్టేటస్ సంపాదించుకుని దేశాన్ని కించపరిచేలా ఉన్న సిరీస్ లో నటించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రియాంకపై తిట్ల దండకం అందుకుంటున్నారు.  ఈ ఇష్యూపై ఆమె ఏమీ రెస్పాండ్ అవకుండా సైలెంట్ గా ఉండిపోయింది.

క్వాంటికో-3 సిరీస్ కు బంగ్లాదేశ్ కు చెందిన షర్బారీ అహ్మద్ రైటర్. ఆయన ఇండియన్స్ కోపం అర్ధం లేనిదంటూ కొట్టిపారేశాడు. ఈ నేపథ్యంలో ప్రియంకను కాపాడేందుకు ఈ సిరీస్ ప్రొడ్యూస్ చేసిన ఏబీసీ ఛానల్ రంగంలోకి దిగింది. ‘‘ఈ సిరీస్ కు కథరాయడంలో గానీ.. డైరెక్ట్ చేయడంలో గానీ.. నిర్మించడంలో కానీ ప్రియాంకకు ఎటువంటి సంబంధమూ లేదు. తను డైరెక్టర్ చెప్పినట్టు నటించింది అంతే. ఇదో ఫిక్షనల్ కథ మాత్రమే. రెండు దేశాల మధ్య ఉద్రిక్తత సృష్టించడం.. ప్రేక్షకుల మనసులు గాయపరిచేలా వ్యవహరించడం మా ఉద్దేశం కాదు’’అంటూ ఏబీసీ ఛానల్ ఈ ఇష్యూకు పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు